Site icon NTV Telugu

Kishan Reddy : కిషన్ రెడ్డికి ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ ఇన్‌క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్‌షిప్ అవార్డు’

Kishan Reddy

Kishan Reddy

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ జి.కిషన్ రెడ్డిని ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఇన్‌క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్‌షిప్ అవార్డు’ వరించింది. భారత్-అమెరికాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పీపుల్-టు-పీపుల్ ఎక్స్‌చేంజ్ కార్యక్రమాలు నిర్వహించే.. ‘యూఎస్ ఇండియా SME కౌన్సిల్’ సంస్థ ఈ అవార్డును కేంద్రమంత్రికి అందజేసింది. భారతదేశపు ఘనమైన సంస్కృతిని ప్రోత్సహించడంతోపాటు పర్యాటకాభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన కృషికి గానూ.. అమెరికాలోని మేరీలాండ్ స్టేట్ నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు ఈ అవార్డును కేంద్రమంత్రికి శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) అందజేశారు.

Also Read : Students Protest : ఓయూలో ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థుల అర్థనగ్న ప్రదర్శన

ఈ అవార్డు అందుకున్న సందర్భంగా కిషన్ రెడ్డి ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘యూఎస్ ఇండియా SME కౌన్సిల్’ సంస్థ నుంచి లీడర్ షిప్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో భారతదేశంలో ఘనమైన చరిత్రను, సంస్కృతిని కాపాడుకోవడంతోపాటు పర్యాటక రంగాభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డు దక్కింది’ అని పేర్కొన్నారు.

Also Read : IND W vs BAN W: బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా వరుసగా రెండోసారి ఓటమి..

Exit mobile version