బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ యువమోర్చా సమావేశం నిర్వహించారు. ఈ యువమోర్చ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కి డబల్ డిజిట్ వస్తుందని, కాంగ్రెస్,బీఆర్‌ఎస్ కు చెందిన ఓటర్లు కూడా బిజెపికే ఓటు వేశారన్నారు. గత బీఅర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో అడుకుందని, కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందన్నారు. అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పారు ఇప్పుడు మరిచిపోయారని, 100 రోజులోనే 6 గ్యారంటీ లను అమలు చేస్తామని చెప్పి హామీలను అమలు చేయడం లేదన్నారు కిషన్ రెడ్డి. నిరుద్యోగులకు 4 వేల నిరుద్యోగ భృతి అన్నారు.. ఇప్పుడు ఏమో మేము అలాంటి హామీలు ఇవ్వలేదు అంటున్నారని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బిజెపి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారు. రేవంత్ అసత్య ప్రచారాలను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నమ్మలేదు. రేవంత్ రెడ్డి ప్రచారం చూసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నవ్వుకున్నారు. బీఅర్ఎస్ ప్రభుత్వం పోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం పోవడానికి 5 సంవత్సరాలు కూడా పట్టెలాగా లేదు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున BJYM నేతలు పోరాటం చేయాలి. రాష్ట్రంలో బిజెపి కే భవిష్యత్ ఉంటుంది. బీఅర్ఎస్ పని అయిపోయింది. పాలక పార్టీకి బి అర్ ఎస్ కొమ్ముకస్తుంది. కాంగ్రెస్ లో బీఅర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారు. నిజమైన ప్రతిపక్షంగా ప్రజల కోసం బిజెపి పోరాటం చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలో బిజెపి నుండి పోటీ చేయడానికి యువత సిద్ధంగా ఉండాలి. బీఅర్ ఎస్ కు ఓటు వేసిన కాంగ్రెస్ కు వేసినట్లే. బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటే. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు అమలు అయ్యే వరకు ప్రజల పక్షాన పెద్ద ఎత్తున్న పోరాటం చేస్తాం’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.