Site icon NTV Telugu

Kishan Reddy : సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే కాళేశ్వరం కట్టాడు

Kishan Reddy

Kishan Reddy

సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే కాళేశ్వరం కట్టాడని తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం నీళ్లు ఎర్రవల్లిలోని సీఎం ఫామ్ హౌస్‌కే వస్తున్నాయన్నారు. దళితులని సీఎం చేస్తానని దళితులకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. భద్రాద్రి రాములోరి కల్యాణానికి కేసీఆర్ రారు.. మజ్లీస్ దావత్ లకు మాత్రం వెళ్తారన్నారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాల జనాలు, అమరవీరులు వదిలిన బాణం ఈటల రాజేందర్ అని ఆయన వ్యాఖ్యానించారు. మీ ఎమ్మెల్యే కేసీఆర్ ప్రజలను కలవడని, ఈటల రాజేందర్ గజ్వేల్ కి రాగానే కేసీఆర్ కామారెడ్డికి పారిపోయిండన్నారు కిషన్‌ రెడ్డి. కామారెడ్డిలో కూడా కేసీఆర్ ఒడిపోతాడన్నారు.

Also Read : Puttur: ప్రముఖ టైగర్ టీం టైగర్స్ కల్లెగ కెప్టెన్‌ దారుణ హత్య

ఎన్నో త్యాగాలు, ఆత్మబలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ.. ఈ రోజు ఓ కుటుంబం పాలైందని ఆరోపించారు. ఆ కుటుంబం వేల కోట్ల ప్రజల డబ్బును దోచుకొని మళ్లీ ఏలాలనుకుంటుందని.. భూములు, బిల్డింగ్​లు కొనాలనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ అవినీతిమయం అయిందని, కల్వకుంట్ల కుటుంబంపాలైందని ఆరోపించారు. ఎమ్మెల్సీలు మొత్తం కట్టకట్టుకొని బీఆర్​ఎస్‌లోకి పోయారని విమర్శించారు. అందుకే బీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనే నిలబడుతుందన్నారు. బీఆర్​ఎస్​తో బీజేపీ ఇప్పటి వరకు పొత్తు పెట్టుకోలేదని.. భవిష్యత్​లో పెట్టుకోబోదని చెప్పారు. కానీ, కాంగ్రెస్​ పార్టీ అనేక ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందని పేర్కొన్నారు. ఢిల్లీలో టీఆర్​ఎస్​ వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయని తెలిపారు.

Exit mobile version