Site icon NTV Telugu

Kishan Reddy : రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సీఎం స్పందించడం లేదు

Kishan Reddy

Kishan Reddy

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రైతులను పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లోని నేతలకు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సీఎం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫసల్ బీమా పథకం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. అలాంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపాలని కోరారు. మహా సంపర్క్ యాత్రకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.

Also Read : AP : ఏపీ సముద్రతీర ప్రాంతంలోని 32 లక్షల మంది ప్రజలకు ముంపు ముప్పు..

ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మహబూబ్‌నగర్‌ నుంచి విశాఖపట్నం వెళ్లే 12862 నంబర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును కిషన్‌రెడ్డి ప్రారంభించారు. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్‌లో జెండాను ఎగురవేసి ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌ను ఏపీలోని కోస్తా జిల్లాలు, విశాఖపట్నంతో కలుపుతున్న తొలి రైలు ఇదే కావడం విశేషం. దేశంలో డిజిటల్ విప్లవం వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రూ.వెయ్యి ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాలకు కేంద్రం 42 శాతం నిధులు ఇస్తోందన్నారు. రైతులకు రూ.లక్ష సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. ఎరువులపై లక్ష కోట్లు. తెలంగాణలో కనీసం పంటల బీమా కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న చిత్తశుద్ధి వారికి లేదు కానీ రికార్డు సమయంలో ప్రగతి భవన్, సచివాలయం నిర్మిస్తామన్నారు.

Also Read : NTR: నా బాధల్లో.. సంతోషాల్లో తోడున్నది మీరే.. గుండెలను పిండేస్తున్న ఎన్టీఆర్ లేఖ

Exit mobile version