Site icon NTV Telugu

Kishan Reddy : తెలంగాణలో పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యనే

Kishan Reddy

Kishan Reddy

పూర్తి శక్తితో పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ లో చేరికలు పై దృష్టి సారించినట్లు, ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ నినాదం తో ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. తెలంగాణలో పోటీ బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య నే అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం అవశ్యకత తెలంగాణకు అవసరం లేదు.. బీఆర్ఎస్‌ ఇరెలవెంట్(అప్రస్తుతం) పార్టీ అని ఆయన అభివర్ణించారు. తెలంగాణలో బీజేపీ మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకుంటుంది కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో కోసం ప్రజల నుండి అభిప్రాయాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. నవ యువ ఓటర్ లను కలుస్తాం… 90 శాతం వారు మోడీ కి అండగా ఉన్నారన్నారు.

 

జనవరి 14 నుండి 22 వరకు దేవాలయాల్లో స్వచ్చ అభియాన్ కార్యక్రమమని, రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రతి హిందువు పాల్గొనాలన్నారు. 150 దేశాల్లో లైవ్‌లో వీక్షించవచ్చన్నారు. రేవంత్ రెడ్డి సీబీఐ ఎంక్వైరీ కోసం అప్పుడు ఎందుకు రాశారు…. ఇప్పుడు ఎందుకు ఆదేశించడం లేదని ఆయన ప్రశ్నించారు. అడిగిన వాటికి సమాధానం చెప్పలేక, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒకటే నని ప్రచారం చేస్తున్నారు.. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారన్నారు. బీజేపీ దాడికి తట్టుకోలేక రాహుల్ గాంధీ పారి పోయారని, పార్టీ లో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి వాటిని అధిగమించి మోడీ నీ ప్రధాని గా అత్యధిక ఎంపీలతో అధికారం లోకి తీసుకొస్తామని కిషన్‌ రెడ్డి అన్నారు.

Exit mobile version