NTV Telugu Site icon

Kishan Reddy : కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియాలి

Kishan Reddy On Kcr

Kishan Reddy On Kcr

తెలంగాణ ముఖ్యమంత్రికి కేంద్ర ప్రభుత్వం తరపున అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై లేఖలు రాస్తున్నా అని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియాలని, ముఖ్యమత్రి కేసీఅర్ కు రాష్ట్రం అభివృద్ధి జరగాలని లేదని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించటం మాత్రమే సీఎం కేసీఆర్‌కు తెలుసని ఆయన మండిపడ్డారు. కేంద్రం అందించే సహకారాన్ని అందిపుచ్చుకునే ఆలోచన లేదని, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆలోచన.. తప్ప అభివృద్ధి గురించి ఆలోచన లేదని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వస్తే, ముఖ్యమంత్రికి తీరిక లేదని.. కానీ.. మహారాష్ట్రలో మాత్రం గాల్లో దీపం పెట్టేలా, బీఆర్‌ఎస్‌ మీటింగ్ పెడ్తారట అంటూ ఆయన ధ్వజమెత్తారు. భద్రాచలంలో రాముని కళ్యాణం కోసం హాజరై పట్టు వస్త్రాలు సమర్పించే సమయం లేదని, రంజాన్ సందర్భంగా వేషం మార్చుకుని దట్టి సమర్పిస్తారంటూ ఆయన విమర్శలు గుప్పించారు.

Also Read : Osmania University : మే 1 నుంచి ఓయూలో పాఠశాల విద్యార్థులకు కమ్యూనికేషన్ కోర్సు

ఇదిలా ఉంటే.. నిన్న ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అంటే కేసీఆర్‌కు గౌరవం లేదన్నారు. ఎన్నికల్లో లబ్దిపొందేందుకే 125 అడుగుల ఎత్తైన డాక్టర్‌ బిఆర్‌ విగ్రహం పనులు పూర్తి చేశారని విమర్శించారు. భారత రాజ్యాంగంలో మార్పులు తేవాలని కోరిన రోజే కేసీఆర్ అసలు రంగు బయటపడిందని అన్నారు. కేసీఆర్‌కు ఇఫ్తార్ విందులకు సమయం ఉందని.. కానీ భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించలేకపోతున్నారని విమర్శించారు.

Also Read : Sachin Pilot : రాజస్థాన్‌ కాంగ్రెస్‌ లో చల్లారని వేడి.. కీలక సమావేశానికి పైలట్ డుమ్మా

Show comments