Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
- ఈ నెల 17న అంబర్‌పేటలో బతుకమ్మ సంబరాలకు పిలుపు
- మహిళా శక్తికి బతుకమ్మ ప్రతీక అన్న కిషన్ రెడ్డి
- మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారని ప్రశంస
- డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం నవంబర్‌లో పాదయాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నిర్వహించిన మహిళా సదస్సులో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నెల 17వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు అంబర్‌పేట ప్రాంత ప్రజలంతా కులమతాలకు అతీతంగా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని పూజిస్తూ అందరూ కలిసికట్టుగా ఆడుకునే ఈ పండుగ మన పూర్వీకుల సంస్కృతికి, మహిళా శక్తికి నిలువెత్తు ప్రతీక అని కొనియాడారు. నిజాం దారుణ పాలనకు, రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ లాంటి వీరవనితలు బతుకమ్మను సాక్షిగా చేసుకునే పోరాటాలు చేశారని చారిత్రక అంశాలను గుర్తుచేశారు. నిజాం ప్రైవేట్ సైన్యం తెలంగాణ ఆడబిడ్డలపై చేసిన దౌర్జన్యాల రోజులను వివరిస్తూ, మన సంస్కృతే మన బలంగా నిలిచిందని పేర్కొన్నారు.
అన్ని రంగాల్లోనూ ముందంజలో భారత నారీమణులు
నేటి భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లోనూ అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ దేశ కీర్తిని నలుదిశలా చాటుతున్నారని కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సాధారణ గిరిజన కుటుంబం నుంచి వచ్చిన ద్రౌపది ముర్ము దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించడం, తెలంగాణ కోడలు నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశ రక్షణ, ఆర్థిక వ్యవస్థలను నడిపించడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. విమానాలు, అంతరిక్ష నౌకలు, యుద్ధ విమానాలు నడపడంతో పాటు సరిహద్దుల్లో సైనిక బలగాల్లోనూ, బహుళజాతి కంపెనీల సారథ్యంలోనూ మహిళలే ముందంజలో ఉన్నారన్నారు. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన మెజారిటీ పతకాలు మన ఆడబిడ్డలే సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారని అభినందించారు.
Also Read
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
మహిళా సంఘాలకు కేంద్ర ప్రోత్సాహం.. డ్రగ్స్ రహిత తెలంగాణకై పిలుపు
హైదరాబాద్ ఐటీ రంగాభివృద్ధిలోనూ మన ఆడబిడ్డలు కీలక పాత్ర పోషిస్తున్నారని, స్వయం సహాయక మహిళా సంఘాలకు (పొదుపు సంఘాలు) ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.20 లక్షల వరకు బ్యాంక్ రుణాలను అందిస్తూ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తోందని కిషన్ రెడ్డి వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించి, ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మహమ్మారి విస్తరిస్తుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్ తరహా పరిస్థితులు తెలంగాణకు రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా పెట్టాలని కోరారు.
2029 నాటికి భారతదేశాన్ని ‘నషా ముక్త భారత్’గా మార్చాలనే ప్రధాని మోదీ సంకల్పంలో భాగంగా, నవంబర్ నెలలో హైదరాబాద్‌లో రాజకీయాలకు అతీతంగా భారీ పాదయాత్ర చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ మాదకద్రవ్యాల వ్యతిరేక పాదయాత్రలో తెలంగాణ ఆడబిడ్డలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు