Site icon NTV Telugu

Kishan Reddy : లింగాయత్ సమాజ్ డిమాండ్ నెరేవేర్చేందుకు కృషి చేస్తాం

Kishan Reddy On Kcr

Kishan Reddy On Kcr

బీసి నుంచి ఓబీసీ చేర్చాలన్న లింగాయత్ సమాజ్ డిమాండ్ పై… కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, భగవత్ గురుబసపప్పా ఖుభా స్పందించారు. ఈ విషయంతో పాటు పలు డిమాండ్లపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించి… నెరేవేర్చేందుకు కృషి చేస్తామని మంత్రులు లింగాయత్ సమాజ్ నాయకులకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో లింగాయత్ సమన్వయ సమితి తెలంగాణ ఆధ్వర్యంలో…. లింగాయత్ మహా ర్యాలీ, సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో… కేంద్ర మంత్రులు భగవత్ గురుబసపప్పా ఖుభా, కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అర్. కృష్ణయ్య, వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గురువులు, లింగాయత్ సమాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. లింగాయత్ సమాజం ఆధ్యాత్మిక సమాజం, గొప్ప సమాజమని కేంద్ర మంత్రులు పేర్కొన్నారు. అనేక మంది మంత్రులు, నాయకులు కర్ణాటక లింగాయత్ సమాజం నుంచి వచ్చిన వారేనని… అలాగే తెలంగాణలో ఒక యూనిటీగా రాజకీయంగా ఎదగాలని సూచించారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏ సమావేశానికి వెళ్లిన బసవేశ్వర్ ఆశిషులు తీసుకొంటారని గుర్తు చేశారు.

Bridge collapse: బీహార్ నదిలో కుప్పకూలిన వంతెన.. వీడియో వైరల్..

కర్ణాటకలో లింగాయత్ సమాజం ఒక క్షేత్రంల వుందని… తెలంగాణ లో ఐక్యమత్యంగా ఉండి లింగాయత్ సమాజం కోసం కృషి చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కాషాయం దేశభక్తి, ఆధ్యాత్మిక సేవకు ప్రతిరూపమని… ఆ కాషాయం కండువా ధరించి సభకు వచ్చిన లింగాయత్ లకు మంత్రులు అభినందించారు. లింగాయత్ ల సమస్యల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని… తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ హామీ ఇచ్చారు. లింగాయతులంతా బసవేశ్వర వారసులని… లింగాయత్ సమాజ్ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని… రాజ్యసభ సభ్యులు అర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాని కోరారు. లింగాయత్ ని ఓబీసీ లో చేర్చడానికి నేను పోరాడుతానని… రానున్న ఎన్నికల్లో ఈ సమాజ్ నికి 10 ఎమ్మెల్యేలు, 4 ఎంపీ టికెట్లు ఇవ్వాలని కోరారు. రాజకీయంగా కులం బలపడితే గుర్తిపు వస్తుందని… ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు.

Exit mobile version