Arunachal Pradesh: అరుణాచల్‌లో చైనా చొరబాటుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా 60 కిలోమీటర్ల మేర చొచ్చుకువచ్చిందన్న వాదనల్ని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కొట్టిపారేశారు. ఈ ప్రచారం తప్పని, భారత్-చైనాల మధ్య అరుణాచల్‌లో సరిహద్దు చాలా పొడవుగా ఉందని, భూభాగంపై సరిహద్దు పూర్తిగా, స్పష్టంగా గుర్తించబడలేదని ఆయన పేర్కొన్నారు. అరుణాచల్‌లోని అప్పర్ సుబాన్సిరి జిల్లాలో చైనా చొరబాటుకు పాల్పడిందనే వార్తల నేపథ్యంలో కేంద్ర మంత్రి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. తక్సింగ్ ప్రాంతంలో చైనా సైనికులు వాస్తవ నియంత్రణ రేఖ (LAC) దాటి భారత భూభాగంలోకి వచ్చారని స్థానికులు ఆరోపించారు.
అరుణాచల్‌తో సరిహద్దు పూర్తిగా, స్పష్టంగా డీమార్క్ కాలేదని రిజిజు చెప్పారు. భారత్-టిబెట్ మధ్య సరిహద్దు గతంలో పూర్తిగా గుర్తించలేదని ఆయన అన్నారు. కొన్ని ప్రాంతాల్లో చైనా కార్యకలాపాలు పెరిగాయని, స్థానిక గ్రామస్తులు వ్యక్తం చేస్తున్న ఆందోళనల్ని మాత్రం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదే సమయంలో తప్పుడు వీడియోలు, నిర్ధారణ లేని ఆరోపణల్ని ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఇలాంటి ప్రచారం మన సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు దేశాన్ని గందరగోళానికి గురిచేస్తాయని అన్నారు. అయితే స్థానికుల ఆందోళనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోందని చెప్పారు. ఆ ప్రాంతంలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) గస్తీని కూడా పెంచినట్లు వెల్లడించారు.
Also Read
- CJI Surya Kant: ‘సీజేఐ సూర్యకాంత్ తండ్రిలాంటి వారు’.. బార్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు ప్రశంసలు
- Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
- Jammu Kashmir: పాక్‌కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్‌పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
- Central Cabinet Decision: ఏపీకి రైల్వే ప్రాజెక్ట్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
భారత సరిహద్దుల్లో చైనా రహదారుల నిర్మాణాలు చాలా కాలం క్రితమే ప్రారంభమైందని రిజిజు తెలిపారు. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సరిహద్దు వద్ద భారత మౌలిక సదుపాయాలను నిర్మించకూడదన్న విధానాన్ని పార్లమెంట్లో వెల్లడించారని రిజిజు పేర్కొన్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Arunachal Pradesh: అరుణాచల్‌లో చైనా చొరబాటుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
CJI Surya Kant: ‘సీజేఐ సూర్యకాంత్ తండ్రిలాంటి వారు’.. బార్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు ప్రశంసలు
-
Babar Azam: ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు బాబర్ ఆజమ్ ఎందుకు దూరమయ్యాడు? అసలు కారణం ఇదే
-
January 12 Vidudala: జనవరి 12 విడుదల.. రావిపూడి టైటిల్ అదిరిందిగా
-
Maharashtra: బిడ్డను బయటకు తీసి కడుపులో గ్లోవ్స్ మరిచారు..
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!