NTV Telugu Site icon

Dilruba: “దిల్ రూబా” సినిమా నుంచి ‘కన్నా నీ..’ లిరికల్ సాంగ్ విడుదల

Dilruba

Dilruba

Dilruba: సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా “దిల్ రూబా”. ఈ చిత్రంలో రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటిస్తోంది. శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా “దిల్ రూబా” నుంచి మోస్ట్ అవేటెడ్ సాంగ్ ‘కన్నా నీ..’ లిరికల్ వీడియోను విడుదల చేశారు చిత్ర బృందం. టాలెంటెడ్ మ్యూజీషియన్ సామ్ సీఎస్ అద్భుతమైన ట్యూన్‌తో ఈ పాటను కంపోజ్ చేశారు. ఈ పాట ప్రేమ భావోద్వేగాలకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూ “కన్నా నీ ప్రేమ సంద్రమే, నేను నీ తీరమే, కన్నా నువ్వు నా ప్రాణమే, నేను నీ దేహమే…” అంటూ హృదయాన్ని హత్తుకునే లిరిక్స్‌తో సాగుతోంది.

Read Also: Chef Mantra Project K: ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దమైపోయిన సుమ కుకింగ్ షో..

ఇక దిల్ రూబా సినిమా కాస్ట్ & క్రూ విషయానికి వస్తే.. కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తుండగా.. సామ్ సీఎస్ సంగీతన్ని అందిస్తున్నారు. ఇక సినిమాటోగ్రఫీగా డానియేల్ విశ్వాస్, ఎడిటర్ గా ప్రవీణ్.కేఎల్, ప్రొడక్షన్ డిజైనర్ గా సుధీర్ పని చేస్తున్నారు. ఈ సినిమాను రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), దుడ్డి శ్రీనులు పీఆర్ఓలుగా ఉండగా.. విశ్వ కరుణ్ రచన, దర్శకత్వం బాధ్యతలు చేపడుతున్నారు. ఈ లిరికల్ సాంగ్ ప్రేక్షకుల్లో మంచి స్పందన తెచ్చుకుంటోంది. పాటలోని సంగీతం, భావోద్వేగపూరితమైన లిరిక్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. మరి, “దిల్ రూబా” సినిమా ప్రేక్షకుల మనసులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో మార్చి 14న తెలుస్తుంది.