టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మొదటి సినిమా రాజా వారు రాణి గారు. కిరణ్ అబ్బవరం 2019లో రిలీజైన రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమ్యాడు. మినిమమ్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.. డీసెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం తన యాక్టింగ్ తో అదరగొట్టాడు.అలాగే తనదైన కామెడీతో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించాడు.తాజాగా ఈ సినిమా థియేటర్లలో విడుదల అయిన నాలుగేళ్ల తర్వాత టీవీలో టెలికాస్ట్ కాబోతుంది.. సెప్టెంబర్ 10 వ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఈటీవీ లో ఈ సినిమా టెలికాస్ట్ కానుంది. ఈ సినిమా టీవీ ప్రీమియర్ డేట్‌ను ఈటీవీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. రాజా వారు రాణిగారు సినిమాకు రవికిరణ్ కోలా దర్శకత్వం వహించాడు.
ఈ సినిమాలో రహస్య గోరక్ హీరోయిన్‌గా నటించింది. రాజ్‌కుమార్ కసిరెడ్డి మరియు యజుర్వేద్ గుర్రం ముఖ్య పాత్రలను పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసింది.రాజా వారు రాణిగారు సినిమాతో మొదటి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్న కిరణ్ అబ్బవరం ఆ తరువాత ఎస్. ఆర్. కల్యాణ మండపం సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో కూడా తనకి మంచి విజయం లభించింది. ఆ తరువాత కిరణ్ అబ్బవరం తెలుగులో వరుస సినిమాలలో నటిస్తున్నాడు.గత ఏడాది అతడు నటించిన మూడు సినిమాలు విడుదల అయ్యాయి.. ఈ ఏడాది ఇప్పటికే వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కిరణ్ అబ్బవరం.కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్.. ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. రూల్స్ రంజన్‌తో పాటు కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న మరో రెండు సినిమాలు షూటింగ్‌ను జరుపుకుంటోన్నాయి.తాజాగా రూల్స్ రంజన్ ట్రైలర్ విడుదల అయింది.ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాగే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన సమ్మోహనుడా సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది.