తమిళ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఎదురుచూసిన ‘కింగ్డమ్’ సినిమా రిలీజ్‌కి ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలో ఈలం తమిళులను దురదృష్టకరంగా, తక్కువగా చూపించినట్లు నామ్ తమిజార్ కట్చి (Naam Tamilar Katchi – NTK) ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. చెన్నైలోని ఓ ప్రైవేటు థియేటర్ వద్ద NTK కార్యకర్తలు బ్యానర్లు చింపి, సినిమా ప్రొమోషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఈలం తమిళుల అభిమానం కించపరచే ప్రయత్నం సినిమా చేసిందంటే, దాన్ని మేం సహించం’ అంటూ తీవ్రంగా స్పందించారు.
Also Read : Mrunal- Danush : పెళ్ళేయిన కోలివుడ్ స్టార్ హీరోతో మృణాల్ డేటింగ్..?
అయితే ఈ సినిమాలో ఈలం ఉద్యమంతో సంబంధం ఉన్న పాత్రలను నెగటివ్‌గా చూపించినట్లు, వారు చేసిన పోరాటాన్ని అసత్య రీతిలో ప్రదర్శించినట్లు NTK నేతలు ఆరోపిస్తున్నారు. ఒక యుద్ధ నేపథ్యంలో సాగే కథలో, కొన్ని పాత్రలు ఈలం ఉద్యమాన్ని ప్రతినిధించగా ,ఆ దృశ్యాలను వక్రీకరించి చూపించారని భావిస్తున్నారు. అందుకే థియేటర్ బయట పెద్ద ఎత్తున బ్యానర్లు చింపుతూ కోపంతో రగిలిపోతున్నారు. ఈ వివాదంపై ఇప్పటి వరకు ‘కింగ్డమ్’ దర్శకుడు లేదా నిర్మాతల నుంచి స్పందన రాకపోవడంతో, ఈ కేసు మరింత వైరల్ అవుతోంది.
తమిళనాడు పోలీసుల దృష్టికి కూడా ఈ ఘటన వెళ్లినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఈ ఘటనపై ప్రజల అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి. కొంతమంది నామ్ తమిజార్ కట్చి చర్యను సమర్థిస్తుండగా, మరికొందరు సినిమాను పూర్తిగా చూసాకే తీర్పు చెప్పాలని అంటున్నారు. పాపం ‘కింగ్డమ్’ సినిమా రీలీజ్‌కు ముందు వచ్చిన ఈ వివాదం బాక్సాఫీస్ కలెక్షన్ల పై ఎంత ప్రభావం చూపిస్తుందో చూడాలి. అలాగే సినిమా యూనిట్ ఎలా స్పందిస్తుందో, వివాదానికి ముగింపు ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే!
#Kingdom – banners torn by the members of Naam Tamizhar Katchi to protest bad portrayal of Eelam tamils in the movie ! pic.twitter.com/BYieY0Iszy
— Prashanth Rangaswamy (@itisprashanth) August 5, 2025