తమిళ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఎదురుచూసిన ‘కింగ్డమ్’ సినిమా రిలీజ్‌కి ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలో ఈలం తమిళులను దురదృష్టకరంగా, తక్కువగా చూపించినట్లు నామ్ తమిజార్ కట్చి (Naam Tamilar Katchi – NTK) ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. చెన్నైలోని ఓ ప్రైవేటు థియేటర్ వద్ద NTK కార్యకర్తలు బ్యానర్లు చింపి, సినిమా ప్రొమోషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఈలం తమిళుల అభిమానం కించపరచే ప్రయత్నం సినిమా చేసిందంటే, దాన్ని మేం సహించం’…