మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మహానటి, సీతారామం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తెలుగులో ఈ హీరోకు మంచి క్రేజ్ ఏర్పడింది.ఆ క్రేజ్ తోనే దుల్కర్ నటించిన పలు సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి.ఇటీవల ఈ హీరో నటించిన గన్స్ అండ్ గులాబ్స్ వెబ్ సిరీస్ కూడా సూపర్‌హిట్ గా నిలిచింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో కొన్ని వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉన్నారు దుల్కర్ . ఇదిలా ఉంటే దుల్కర్ సల్మాన్ నటించిన రీసెంట్ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానుంది. అభిలాష్ జోషీ దర్శకత్వంలో దుల్కర్ నటించిన మూవీ కింగ్ ఆఫ్ కోత. గ్యాంగస్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా లో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటించింది. షబీర్ కల్లరక్కల్, ప్రసన్న, శరణ్ శక్తి, చెంబన్ వినోద్ జోస్, అనికా సురేంద్రన్, నైలా ఉష, శాంతి కృష్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. . గురు ఫేమ్ రితికా సింగ్ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. ఫారెర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై జీస్టూడియోస్‌తో కలిసి దుల్కర్ సల్మాన్ స్వయంగా కింగ్ ఆఫ్ కోత సినిమాను నిర్మించారు. జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అందించారు..
ఈ సినిమా లో గ్యాంగస్టర్ రాజు అనే పాత్రలో దుల్కర్ నటించాడు. ఊర మాస్ గ్యాంగ్‌స్టర్‌గా అతని లుక్, నటన అదిరిపోయాయి.మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 24న ఎంతో గ్రాండ్ గా విడుదలైంది. అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.. అయితే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ తన నటనతో అదరగొట్టాడు. యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎంతగానో బాగున్నాయని టాక్ వచ్చింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన కింగ్ ఆఫ్ కోత ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాబోతుంది.ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీప్లస్ హాట్ స్టార్ దుల్కర్ సల్మాన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 22 నుంచి ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం