Site icon NTV Telugu

Satyam Sundaram : సత్యం సుందరం సినిమా చూసిన నాగార్జున…ఏమన్నారంటే?

New Project (30)

New Project (30)

Satyam Sundaram : సత్య సుందరం ఒక కంప్లీట్ ఎంటర్ టైనర్. ఈ మూవీలో హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలు పోషించారు. ’96’ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు. సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగు ప్రేక్షకులకు అందించింది. ఈ చిత్రం విడుదలైన ప్రతిచోటా పాజిటివ్ టాక్‌తో ప్రశంసలు అందుకుంటుంది. రీసెంట్ గా ఈ సినిమాని వీక్షించిన కింగ్ నాగార్జున ‘ఎక్స్’లో తన స్పందన తెలియజేసి యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాలో ఎన్నో బాల్యం జ్ఞాపకాలను గుర్తుచేసిందని నాగార్జున కొనియాడారు. ఈ సందర్భంగా నాగ్….‘‘డియర్ కార్తీ.. నిన్న నైట్ సత్యంసుందరం మూవీ చూశాను!!. నువ్వు, అరవింద్ చాలా బాగా మెప్పించారు. సినిమాలో నిన్ను (కార్తీ) చూసి నవ్వుతూనే ఉన్నాను. అదే చిరునవ్వుతో నిద్రపోయాను. ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మనిద్దరం నటించిన ‘ఊపిరి’ సినిమాను కూడా గుర్తుచేసుకున్నాను. హృదయాన్ని హత్తుకునేలా ఉన్న మీ నటన ప్రేక్షకులు, విమర్శకులు అభినందనలు కురిపిస్తుండడం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది!!. మూవీ యూనిట్‌కు మొత్తానికి నా అభినందనలు’’ అని రాసుకొచ్చారు.

Read Also:International Podcast Day 2024: నేడే అంతర్జాతీయ పోడ్‌కాస్ట్ దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారంటే?

ఈ సినిమాలో చిన్ననాటి ముచ్చట్లు, బాల్యంలో జరిగే సరదాలు.. ఇంకా చాలా గుర్తులు మన కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. ఒక్క నాగార్జునే కాదు.. ఈ సినిమా చూసిన వాళ్లంతా ఇలాగే రియాక్ట్ అవ్వడం విశేషం. ’96’ సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. ఆయన నుంచి వచ్చిన ‘సత్యం సుందరం’ సినిమా కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందడం గమనార్హం. అలాగే ఈ సినిమాలో కార్తీ నటనకు ఫిదా అవుతున్నారు. అలాగే ’96’కి సంగీతం అందించిన గోవింద్ వసంత్ ఈ సినిమాతో మరోసారి తన ప్రతిభ చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్లు ఊపందుకుంటున్నాయి.

Read Also:Tripura Crime: దారుణం.. కన్నతల్లిని చెట్టుకు కట్టేసి సజీవదహనం చేసిన కొడుకులు

Exit mobile version