Satyam Sundaram : సత్యం సుందరం సినిమా చూసిన నాగార్జున…ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satyam Sundaram : సత్య సుందరం ఒక కంప్లీట్ ఎంటర్ టైనర్. ఈ మూవీలో హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలు పోషించారు. ’96’ ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు. సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగు ప్రేక్షకులకు అందించింది. ఈ చిత్రం విడుదలైన ప్రతిచోటా పాజిటివ్ టాక్‌తో ప్రశంసలు అందుకుంటుంది. రీసెంట్ గా ఈ సినిమాని వీక్షించిన కింగ్ నాగార్జున ‘ఎక్స్’లో తన స్పందన తెలియజేసి యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాలో ఎన్నో బాల్యం జ్ఞాపకాలను గుర్తుచేసిందని నాగార్జున కొనియాడారు. ఈ సందర్భంగా నాగ్….‘‘డియర్ కార్తీ.. నిన్న నైట్ సత్యంసుందరం మూవీ చూశాను!!. నువ్వు, అరవింద్ చాలా బాగా మెప్పించారు. సినిమాలో నిన్ను (కార్తీ) చూసి నవ్వుతూనే ఉన్నాను. అదే చిరునవ్వుతో నిద్రపోయాను. ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మనిద్దరం నటించిన ‘ఊపిరి’ సినిమాను కూడా గుర్తుచేసుకున్నాను. హృదయాన్ని హత్తుకునేలా ఉన్న మీ నటన ప్రేక్షకులు, విమర్శకులు అభినందనలు కురిపిస్తుండడం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది!!. మూవీ యూనిట్‌కు మొత్తానికి నా అభినందనలు’’ అని రాసుకొచ్చారు.
Read Also:International Podcast Day 2024: నేడే అంతర్జాతీయ పోడ్‌కాస్ట్ దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారంటే?
Also Read
ఈ సినిమాలో చిన్ననాటి ముచ్చట్లు, బాల్యంలో జరిగే సరదాలు.. ఇంకా చాలా గుర్తులు మన కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. ఒక్క నాగార్జునే కాదు.. ఈ సినిమా చూసిన వాళ్లంతా ఇలాగే రియాక్ట్ అవ్వడం విశేషం. ’96’ సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. ఆయన నుంచి వచ్చిన ‘సత్యం సుందరం’ సినిమా కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందడం గమనార్హం. అలాగే ఈ సినిమాలో కార్తీ నటనకు ఫిదా అవుతున్నారు. అలాగే ’96’కి సంగీతం అందించిన గోవింద్ వసంత్ ఈ సినిమాతో మరోసారి తన ప్రతిభ చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్లు ఊపందుకుంటున్నాయి.
Read Also:Tripura Crime: దారుణం.. కన్నతల్లిని చెట్టుకు కట్టేసి సజీవదహనం చేసిన కొడుకులు
Dear brother Karthi, I saw your film #SatyamSundaram last night!! You and Arvind ji were just too too good… I had a smile throughout watching you and went to sleep with the same smile… Brought back so many childhood memories… and also memories of our film #oopiri .
I’m so…— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 30, 2024
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!