NTV Telugu Site icon

Virat Kohli: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ..

Virat Kohli Test

Virat Kohli Test

కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్లు చెలరేగిపోయారు. 25 ఓవర్లలోనే భారత్ 200 పరుగులు చేసింది. టెస్టు ఇన్నింగ్స్‌లో టీమిండియా అత్యంత వేగంగా 200 పరుగులు చేయడం ఇదే మొదటి సారి. ఈ క్రమంలో.. భారత్ ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టింది. ఇదిలా ఉంటే… వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో రికార్డు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 27 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును కింగ్ కోహ్లీ బద్దలు కొట్టాడు. కోహ్లి 594 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. సచిన్ టెండూల్కర్ 623 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ 35 బంతుల్లో 47 పరుగులు చేశాడు. షకీబ్ అల్ హసన్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

Read Also: Netanyahu- Modi: ఇజ్రాయెల్‌ ప్రధానికి మోడీ ఫోన్ కాల్.. తాజా పరిణామాలపై చర్చ

కాన్పూర్ టెస్టు నాలుగో రోజు భారత్‌కు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ దూకుడు ఇన్నింగ్స్ తో మంచి ఆరంభాన్ని అందించారు. ఇతర బ్యాట్స్‌మెన్ కూడా అదే జోరుతో బ్యాటింగ్ చేశారు. బంగ్లాదేశ్‌తో జరిగిన కాన్పూర్ టెస్టులో.. టెస్టు క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో వేగంగా 50, ఫాస్టెస్ట్ 100, ఫాస్టెస్ట్ 150, ఫాస్టెస్ట్ 200, ఫాస్టెస్ట్ 250 పరుగులు చేసిన రికార్డులను భారత్ సృష్టించింది. ఇంతకుముందు కూడా ఫాస్టెస్ట్ 100, ఫాస్టెస్ట్ 150 రికార్డు భారతదేశం పేరిట ఉండేది.

Read Also: Kolikapudi Srinivasa Rao: తిరువూరు ఎమ్మెల్యే వ్యవహారంలో మరో ట్విస్ట్..

అత్యంత వేగంగా 200 పరుగులు చేసిన రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2017లో సిడ్నీలో పాకిస్థాన్‌పై 28.1 ఓవర్లలో 200 పరుగులు చేసింది. తాజాగా.. బంగ్లాదేశ్‌పై భారత్ 148 బంతుల్లో (24.4 ఓవర్లు) 200 పరుగుల మార్క్‌ను చేరుకుంది. అత్యంత వేగంగా 50, 250 పరుగుల రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ అత్యంత వేగంగా 50 పరుగులు చేసింది. 2022లో పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ వేగంగా 250 పరుగులు చేసింది. ఇంగ్లండ్ 34 ఓవర్లలో 250 పరుగులు చేసింది. భారత్ 30.1 ఓవర్లలో 250 పరుగులు చేసింది.

Show comments