NTV Telugu Site icon

Viral Video: రోడ్డుపై తాచుపాము, ముంగిస హల్‌చల్.. వీడియో ఇదిగో..

Snake

Snake

King Cobra and Mongoose Massive Fight, Viral Video: పాము, ముంగిస ఒకదానికి ఒకటి తారసపడ్డాయంటే..ఇక భీకర పోరే. అవి పొట్లాడుకున్న దృశ్యాలు మనం గతంలో చూసే ఉంటాం. అయితే నడిరోడ్డుపై తాచుపాము, ముంగిస భీకరంగా దాడి చేసుకుంటున్న వీడియో ఒకటి తాజాగా వైరల్‌ అయ్యింది. రోడ్డుపైకి వచ్చిన తాచుపాముపై ముంగిస దాడి చేయడానికి ప్రయత్నించింది. తాచుపాము బుసలు కొడుతూ దీటుగా ప్రతిదాడి చేసింది. కాగా ఈ వీడియోకు నెటిజన్ల నుంచి ఆదరణ లభిస్తోంది.

Also Read: Tooth Pain: పంటి నొప్పి ఇబ్బంది పెడుతుందా?.. ఇలా చేస్తే క్షణాల్లో నొప్పి మాయం..

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో రహదారిపై తాచు పాము, ముంగిస హల్ చల్ చేశాయి. దాదాపు అరగంట పాటు ప్రధాన రహదారిపై తాచుపాము బుసలు కొట్టింది. ముంగిస దానితో పోరాటానికి ప్రయత్నించగా.. బుసలు కొడుతూ దానిని కాటు వేయడానికి తాచుపాము యత్నించింది. రోడ్డుపై వెళ్లే స్థానికులు భయాందోళనకు గురై అరగంటపాటు అటు దిశగా వెళ్లలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తోంది.