NTV Telugu Site icon

Kim Yo Jong: ఉత్తర కొరియా గగనతలంలోకి అమెరికా గూఢచారి విమానం.. కిమ్ సోదరి వార్నింగ్!

North Korea

North Korea

Kim Yo Jong: ఉత్తర కొరియా నియంత్రిస్తున్న ప్రాంతం గగనతలంలోకి అమెరికా మిలిటరీ గూఢచారి విమానం ఎనిమిది సార్లు ప్రవేశించిందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తెలిపారు. తమ దేశానికి చెందిన యుద్ధ విమానాలు ఆ అమెరికా గూఢచారి విమానాన్ని తరిమికొట్టాయని అన్నారు. ఆ ప్రాంతంలో అమెరికా నిఘా కార్యకలాపాలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు.ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియాలో ప్రచురించిన కిమ్ సోదరి యో జోంగ్ వ్యాఖ్యలపై అమెరికా, దక్షిణ కొరియా మిలిటరీలు ఇంకా స్పందించలేదు.

Also Read: World Population Day 2023: నేడు ప్రపంచ జనాభా దినోత్సవం.. ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

మరోవైపు ఉత్తర కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానిస్తూ.. గతంలో అమెరికా తమ గగనతలంలోకి గూఢచారి విమానాలను ఎగురవేస్తోందని ఆరోపించింది. వాటిని కూడా కూల్చివేస్తామని హెచ్చరించింది. ఉత్తర కొరియా భూభాగంలోకి అమెరికా గూఢచారి విమానాలను ఎగురవేయడాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఖండించారు. దక్షిణ కొరియా సైన్యంతో కలిసి అమెరికా ప్రామాణిక నిఘా కార్యకలాపాలు చేస్తోందని వారు తెలిపారు. ఆ మాటలపై స్పందించిన కిమ్ యో జోంగ్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ యూఎస్ మిలిటరీకి ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అమెరికా తన నిఘా కార్యకలాపాలను ముమ్మరం చేస్తోందని, ఇది ఉత్తర కొరియా సార్వభౌమాధికారం, భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని ఆమె పేర్కొన్నారు.

Also Read: India: 2075 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

ఉత్తర కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన తమ ప్రాదేశిక గగనతలంలోకి చొరబడడాన్ని సూచించగా, ఉత్తర కొరియాకు చెందిన ప్రత్యేక ఆర్థిక మండలంలోకి అమెరికా గూఢచారని విమానాన్ని పంపిందని కిమ్ యో జోంగ్ ఆరోపించారు.ఈ ప్రాంతంలోకి అమెరికా గూఢచారి విమానం ప్రవేశించిందని, అయితే ఉత్తర కొరియా యుద్ధ విమానాలు దానిని తరిమికొట్టాయని ఆమె చెప్పారు.ఆపై ఉత్తర కొరియా సైన్యం నుంచి బలమైన హెచ్చరిక వచ్చింది.ఉత్తర కొరియా తమ ప్రత్యేక ఆర్థిక జోన్‌పై నిఘా విమానాలను ఎగురవేయడాన్ని కొనసాగిస్తే ఉత్తర కొరియా నిర్ణయాత్మక చర్య తీసుకుంటుందని కిమ్ యో జోంగ్ హెచ్చరించారు.