Site icon NTV Telugu

FIFA World Cup: వరల్డ్ కప్ స్టేడియం వద్ద కిమ్‌ జోంగ్‌ ఉన్‌!.. ఫొటోలు వైరల్

Kim Jong Un

Kim Jong Un

FIFA World Cup: ఫిఫా ప్రపంచ కప్ 2022 ఫైనల్ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. టైటిల్ పోరులో అర్జెంటీనా, ఫ్రాన్స్‌లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ కోసం వచ్చిన అభిమానులకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను పోలిన వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తిని చూసిన అభిమానులు కిమ్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లూసెయిల్‌ స్టేడియం దగ్గరలోని ఫ్యాన్‌ ఫెస్టివల్‌ దగ్గర ఉన్న అతడిని ఫొటోగ్రాఫర్స్ చుట్టుముట్టారు. ఖతార్‌లో జరిగిన ఫిఫా ప్రపంచకప్ తనకు చాలా హుందాగా అనిపించిందని.. ఉత్తర కొరియా నాయకుడిలా కనిపించే హోవార్డ్ సోషల్ మీడియాలో వ్యక్తపరిచాడు. కిమ్‌లా కనిపించే ఆ వ్యక్తి పేరు హోవార్డ్‌ ఎక్స్. చైనా మూలాలు ఉన్న హోవార్డ్ ఎక్స్‌.. ఆస్ట్రేలియా పౌరుడని సమాచారం.

Mrs World 2022: మిసెస్ వరల్డ్‌గా సర్గం కౌశల్‌.. 21 ఏళ్ల తర్వాత దేశానికి కిరీటం

ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ తనకు ఆనందాన్ని పంచిందని హోవార్డ్‌ వెల్లడించాడు. గతంలో బ్రెజిల్‌, రష్యా దేశాల్లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లతు తాను హాజరైనట్లు చెప్పాడు. అంతే కాకుండా ఈ నెల ప్రారంభంలో ‘2030లో ఉత్తర‌కొరియాలో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వహ‌ణకు లాబీయింగ్ చేయడానికి వ‌చ్చాను’ అంటూ ఒక వీడియో విడుద‌ల చేశాడు. వృత్తిరీత్యా సంగీత దర్శకుడైన హోవార్డ్‌.. ఉత్తర కొరియా అధ్యక్షుడిలాగా ఉండడంతో అతడిని తరచూ అనుకరిస్తూ ఉంటాడు. అతను ఉత్తర కొరియా నాయకుడిని కీర్తించడానికి కాదు, అతనిపై వ్యంగ్యం చేయడానికి ఉత్తర కొరియా నాయకుడిని అనుకరిస్తున్నట్లు చెప్పాడు.

Exit mobile version