Khazana Jewellery: ఖజానా జ్యువెలరీలో దోపిడీ దొంగల బీభత్సం.. సిబ్బందిపై కాల్పులు!
- చందానగర్‌లో కాల్పుల కలకలం
- ఖజానా జ్యువెలర్స్ షాప్‌లో దోపిడీకి యత్నం
- దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Robbery attempt at Khazana Jewellers in Chandanagar: హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో కాల్పుల కలకలం రేగింది. ప్రముఖ నగల దుకాణం ‘ఖజానా జ్యువెలర్స్’లో దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. దొంగతనంను అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా.. కాల్పులు కూడా జరిపారు. దుండగుల కాల్పుల్లో షాపులోని పలువురు సిబ్బందికి గాయాలు అయ్యాయి. పోలీసుల రంగప్రవేశంతో దుండగులు షాప్‌లో నుంచి తప్పించుకుపోయారు. కేసు నమోదు చేసిన చందానగర్ పోలీసులు.. దుండగుల కోసం గాలిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
Also Read: Warangal Rains: వరంగల్ జిల్లాలో కుండపోత వర్షం.. 92.9 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం!
Also Read
దుండగులు ముందుగా ఖజానా జ్యువెలర్స్ గేట్ సిబ్బందిని గాయపరిచి లోపలికి ఎంటర్ అయ్యారు. ఎదురుతిరిగిన సిబ్బందిపై తుపాకీతో కాల్పులు జరిపారు. మరికొందరిపై దాడులకు సైతం పాల్పడ్డారు. లాకర్ కీ ఇవ్వకపోవడంతో గన్ తీసుకొని బెదిరించారు. దుండగుల ముఠా అసిస్టెంట్ మేనేజర్‌పై కాల్పులు జరిపింది. షాప్ లోపల బంగారు ఆభరణాలకు సంబందించిన స్టాల్స్ పగలగొట్టారు. స్టాఫ్ సిబ్బంది ఒకరు పోలీసులకు కాల్ చేయగా.. వెంటనే వారు ఖజానా జ్యువెలర్స్ షాప్‌కు చేరుకున్నారు. పోలీసులను చూసి దొంగల ముఠా పారిపోయింది.
దుండగులు రెండు రౌండ్ల ఫైరింగ్ జరిపారు. తుపాకీతో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. గ్యాంగ్‌లో మొత్తం 6 మంది సభ్యులు ఉన్నట్లు సమాచారం. దుండగుల కోసం 10 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో చందానగర్‌లో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు.
తాజావార్తలు
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!