NTV Telugu Site icon

Mallikarjun Kharge: గతంలో ఆమె తిరస్కరించారు..ప్రధాని అభ్యర్థిపై ఖర్గే సంచలన వ్యాఖ్యలు

New Project (30)

New Project (30)

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. నేడు ఆరో దశ పోలింగ్ ముగిసింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది. కాగా.. ఒక వేళ ఇండియా కూటమికి అధిక సీట్లు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అందులో ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. తాజాగా శనివారం సిమ్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ ఓ మీడియా సంస్థ “దేశంలో విపక్షాల కూటమి గెలిచిన తర్వాత ప్రధాని ఎవరు?” అనే ప్రశ్న సంధించింది. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. “ఈ ప్రశ్న మీలో ఎవరు కోటీశ్వరుడు అవుతారు అన్నట్లుగా మారింది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపైన తర్వాత విపక్ష నేతలంతా కలిసి నిర్ణయం తీసుకుంటాం. గతంలో కాంగ్రెస్ కు అత్యధిక సీట్లు ఉన్నప్పటికీ సోనియా గాంధీ ప్రధాన మంత్రి పదవి ప్రతిపాదనను తిరస్కరించారు. మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. పదేళ్లపాటు యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపాం.ఈ విషయాన్ని మర్చిపోయారా?” అని సమాధానమిచ్చారు.

READ MORE: Delhi fire: ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 26 ఫైరింజన్లు

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని హిందువులు, ముస్లింల మధ్య విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకం కాదని, ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకమన్నారు. ప్రధాని మోడీ దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పారని, 2014లో రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి రప్పించడం, ద్రవ్యోల్బణం తదితర హామీలను నెరవేర్చలేదన్నారు. హిమాచల్‌లో కూడా ప్రధాని మోడీ 2014, 2019లో భారీ వాగ్దానాలు చేశారన్నారు. గెలిచిన తర్వాత తిరిగి చూడలేదని ఆరోపించారు. హిమాచల్ విపత్తులో మునిగినప్పుడు సహాయం చేయలేదన్నారు. బీజేపీ రాష్ట్రంల్లోని ప్రభుత్వాలను పడగొట్టేందుకు యత్నిస్తోందని.. హిమాచల్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చూస్తోందన్నారు. ధనబలం, గూండాయిజం, ఈడీ సీబీఐని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కృషి చేస్తోందని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.