NTV Telugu Site icon

Mallikarjun Kharge : ఎన్డీయే ప్రభుత్వం పొరపాటున ఏర్పాటైంది.. ఎప్పుడైనా పడిపోతది.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు

New Project (76)

New Project (76)

Mallikarjun Kharge :కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని అది ఎప్పుడైనా పడిపోవచ్చని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మొత్తం 240 సీట్లు వచ్చాయి. ఇది మెజారిటీకి అవసరమైన 272 కంటే తక్కువ. అయితే ఎన్నికలకు ముందు ఏర్పాటైన ఎన్డీయేకు పూర్తి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు కేంద్రంలో కూడా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది.

Read Also:Gold Price Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై రూ.660 పెరిగింది!

అయితే ఈ సారి ఎన్డీయే ప్రభుత్వం పొరపాటున ఏర్పాటైంది.. మోడీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ రాలేదు.. ఇది మైనారిటీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు.. కానీ, మేము ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడం లేదు. దేశ ప్రజలకు మంచి జరగడం కోసం మేము ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశాన్ని పటిష్టం చేయడానికి మనం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక, ప్రధాని మోడీ మాత్రం దేశానికి మంచి జరుగుతుందంటే.. అది జరగనివ్వకుండా చేయడం ఆయనకు అలవాటని విమర్శించారు. కానీ, ఇండియా కూటమి మాత్రం పరస్పరం సహకరించుకుంటూ దేశాన్ని పటిష్ట పరుచుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోసం పావులు ఏమైనా కదుపుతోందా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read Also:Impact of Severe Heatwaves: ఉత్తరాదిలో నిప్పులు కురిపిస్తున్న భానుడు..(వీడియో)

ఇక, మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు జేడీయూ నేత నీరజ్‌ కుమార్‌ స్పందించారు. నీరజ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర అందరికీ తెలిసిందే. గతంలో పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌ మైనార్టీ ప్రభుత్వాలను నడిపించారు కదా. అది మరిచిపోతే ఎలా అని సెటైరికల్‌ గా కామెంట్లు చేశారు. అలాగే, దేశ ప్రజలు మోడీ మద్దతుగా ఉన్నారు అని అన్నారు.