Site icon NTV Telugu

Mallikarjun Kharge: మోడీపై ఖర్గే హాట్ కామెంట్స్..

Kharge

Kharge

ఢిల్లీ: ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలే దేశానికి చివరి ఎన్నికలంటూ ఖర్గే హాట్ కామెంట్స్ చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇకపై ఎన్నికలు జరగవని అన్నారు. కాబట్టి ప్రజలు వచ్చే ఎన్నికల్లో అప్రమత్తమై ఓటేయాలని కోరారు. మోడీ గనుక మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే నియంతృత్వమే రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also: US Visa: భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డ్..

వచ్చే ఎన్నికల్లో మతపరమైన సెంటిమెంట్లను ఉపయోగించుకుని లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న బీజేపీని తిప్పికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మతాన్ని రాజకీయాలతో ముడిపెడితే మంచి, చెడులను నిర్వచనం చాలా కష్టమవుతుందన్నారు. బీజేపీకి దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ఎలాంటి ఆసక్తి లేదని. సొంత అధికారం, ఎజెండాపైనే వారి దృష్టంతా ఉందని ఖర్గే విమర్శించారు.

Read Also: YCP Rebel MLAs: వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ వాయిదా..

Exit mobile version