Khanapur Municipality: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. శనివారం కౌన్సిల్ హాల్లో జరిగిన హైడ్రామా, అధికారులతో వాగ్వాదం నేపథ్యంలో వాయిదా పడిన ఎన్నికను నేడు (ఆదివారం) నిర్వహించనున్నారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో అధికారాన్ని దక్కించుకునేందుకు అటు అధికార కాంగ్రెస్, ఇటు విపక్షాలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి.
Pakistan: పెరిగిన పెట్రోల్ ధరలతో జనాగ్రహం.. అర్ధరాత్రి పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
మున్సిపల్ చైర్మన్ ఎంపిక కోసం శనివారం కౌన్సిల్ సమావేశం నిర్వహించగా ఎన్నికైన సభ్యులు చేతులు ఎత్తే క్రమంలో గందరగోళం నెలకొంది. అభ్యర్థి అంకం మౌనిక పేరును అధికారులు ప్రతిపాదించి, ఆమెను బలపరిచే వారు చేతులు ఎత్తాలని సూచించారు. ఆ సమయంలో ఏడుగురు సభ్యులు మద్దతుగా చేతులు ఎత్తారని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వాదించారు. అయితే అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే వారితో వాగ్వాదానికి దిగారు. ఈ చిన్నపాటి కన్ఫ్యూజన్ కాస్తా పెద్ద వివాదంగా మారడంతో, శాంతిభద్రతల దృష్ట్యా అధికారులు ఎన్నికను నేటికి వాయిదా వేశారు.
ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే 7 మంది సభ్యుల (మ్యాజిక్ ఫిగర్) మద్దతు అవసరం. ప్రస్తుత పార్టీల బలాబలాలు బీఆర్ఎస్ 04, బీజేపీ 04, కాంగ్రెస్ 03, ఇండిపెండెంట్ 1 సభ్యుడు ఉన్నారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉండటంతో కాంగ్రెస్ బలం 4కి చేరింది. ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో కాంగ్రెస్ బలం ప్రస్తుతం 5గా ఉంది. అయితే, పీఠం దక్కాలంటే మరో ఇద్దరి మద్దతు కాంగ్రెస్‌కు అనివార్యం అయ్యింది.
Drug Party Busted: ‘ఈగల్ టీం’ మెరుపు దాడులు.. డ్రగ్స్ పార్టీలో దొరికిన బాలీవుడ్, టాలీవుడ్ నటులు..!
చైర్మన్ పీఠం అధికార పార్టీకి దక్కకుండా చేయడమే లక్ష్యంగా బీజేపీ (4), బీఆర్ఎస్ (4) ఏకమైనట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీల కౌన్సిలర్లు కలిసి ఉంటే వారి బలం 8కి చేరుతుంది. ఇది మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ. అయితే ఇదే సమయంలో బీఆర్ఎస్‌కు చెందిన ఒక కౌన్సిలర్ కిడ్నాప్ అయ్యారని పోలీసులకు ఫిర్యాదు అందడం కలకలం రేపుతోంది. సదరు కౌన్సిలర్ కాంగ్రెస్ వైపు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
