NTV Telugu Site icon

Khalistani Group: కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల వద్ద నిరసనలకు ఖలిస్థానీ గ్రూప్‌ పిలుపు

Khalistani Group

Khalistani Group

Khalistani group urges followers to protest outside Indian embassies in Canada: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో బ్రిటీష్‌ కొలంబియాలో ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు భారత్‌కు సంబంధం ఉందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆరోపించిన వారం రోజుల తర్వాత సోమవారం కెనడాలోని ప్రధాన నగరాల్లోని భారత దౌత్య కార్యాలయాల వద్ద నిరసన తెలియజేయాలని ఖలిస్థానీ గ్రూప్‌ తన సభ్యులకు పిలుపునిచ్చింది. కెనడాలోని భారత రాయబార కార్యాలయాల వెలుపల నిరసన తెలియజేయాలని ఖలిస్తానీ గ్రూప్ అనుచరులను కోరింది.

Also Read: Khalistani Terrorist: ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూన్‌ భారత్‌ను ముక్కలు చేయాలనుకున్నాడు..!

అధిక సిక్కు జనాభా కలిగిన వాంకోవర్ శివారులోని సర్రేలో జూన్ 18న గురుద్వారా వెలుపల కాల్చి చంపబడిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉండవచ్చనే ఆరోపణలను కొనసాగిస్తున్నట్లు ట్రూడో చెప్పారు. ఈ హత్యలో ఎలాంటి పాత్ర లేదని భారతదేశం వేగంగా ఖండించింది. ఆరోపణలను అసంబద్ధంగా అభివర్ణించింది. ఈ ఆరోపణలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను రేకెత్తించాయి. ఇరుదేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించాయి. కెనడియన్లకు భారత్‌ వీసాలను నిలిపివేసింది.

Also Read: AIADMK: బీజేపీతో పొత్తును తెగదెంపులు చేసుకున్న ఏఐఏడీఎంకే

కెనడాలోని సిక్కూస్ ఫర్ జస్టిస్ డైరెక్టర్ జతీందర్ సింగ్ గ్రేవాల్ ఆదివారం రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. నిజ్జార్ హత్యపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తమ సంస్థ టొరంటో, ఒట్టావా, వాంకోవర్‌లోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ల వెలుపల ప్రదర్శనలకు నాయకత్వం వహిస్తుందని చెప్పారు. భారత రాయబారిని బహిష్కరించాలని కెనడాను కోరుతున్నామని గ్రేవాల్ తెలిపారు. టొరంటో పోలీస్ డిపార్ట్‌మెంట్ సోమవారం ప్రణాళికాబద్ధమైన ప్రదర్శనల గురించి తమకు తెలుసునని, అయితే భద్రతా సన్నాహాలు లేదా నిరసన సమయంలో తలెత్తే హింసాత్మక పరిస్థితులకు ప్రతిస్పందన వివరాలను వెల్లడించడానికి నిరాకరించింది. నిజ్జర్ దాదాపు 25 ఏళ్ల క్రితం పంజాబ్ వదిలి కెనడా పౌరసత్వం పొందాడు. భారతదేశం జూలై 2020లో నిజ్జర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.