NTV Telugu Site icon

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గడ్ ఎన్‌కౌంటర్‌లో కీలక నేతల హతం?

Chhattisgarh

Chhattisgarh

ఛత్తీస్‌గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మొత్తం 31 మంది చనిపోయారు. అపోస్మత్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో చాలా కీలకమైన నేతలు కూడా మృతి చెందారు. ఇప్పటివరకు మృతి చెందిన వారిలో, కామలేశ్, రామకృష్ణ,నీతి నందు ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఈ ఎన్కౌంటర్లో ముఖ్యమైన వాళ్ళు కూడా అంటే నంబాల కేశవరావు, తక్కెళ్ళపల్లి వాసుదేవరావు కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ధ్రువీకరణ జరగలేదు. అందరి మీద కలిసి రూ. కోటి రివార్డులు ఉన్నాయి.

READ MORE: Irani Cup 2024: మ్యాచ్ డ్రా అయినా.. ఛాంపియన్‌గా నిలిచిన ముంబై

ఎన్‌కౌంటర్ ఎప్పుడు జరిగింది?
ఛత్తీస్‌గఢ్ మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. రాష్ట్రంలోని నారాయణపూర్-దంతెవాడ సరిహద్దుల్లోని మాడ్ ఏరియాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దాదాపుగా 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆటోమేటిక్ గన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు భద్రతా బలగాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం.

READ MORE:PM Narendra Modi: డ్రగ్స్ డబ్బుతో కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు..

ఇటీవల కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించిన దాఖలాలు లేవు. జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) మరియు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) నిన్న మావోయిస్ట్ వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించాయి. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇరు వర్గాల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఏకే-47 రైఫిళ్లతో సహా అటాల్ట్ రైఫిళ్లు, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా ఓర్చా, బర్సూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని గోవెల్, నెందుర్, తుల్తుడి గ్రామాల్లో జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. అటవీ ప్రాంతంలోకి పారిపోయిన మావోల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మావోయిస్టులకు వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద విజయాల్లో ఇది ఒకటని అక్కడి అధికారులు అభివర్ణిస్తున్నారు.