L.B.Nagar Murder Case: ప్రేమోన్మాది కేసులో కీలక విషయాలు.. చిన్నప్పటి నుంచే వేధింపులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్లోజ్‌గా ఉండే స్నేహానికి సడన్‌గా ప్రేమ అని నామకరణం చేసేస్తారు. వద్దంటే చిరాకెత్తిపోతారు. ఎలా నచ్చజెప్పాలో తెలుసుకునే లోపే కత్తులతో రక్తం కళ్ల చూపిస్తారు. ఇదే నేటి తరం ముద్దుగా చెప్పుకుంటున్న రెండక్షరాల ప్రేమ. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అచ్చంగా అదే జరిగింది. ఫలితంగా ఏ పాపం ఎరుగని ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ప్రేమను దక్కించుకుందామనుకున్న అతగాడు ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. ఒకనాటి ప్రేమ వేరు ఈ జనరేషన్ ప్రేమ వేరు. ఆనాటి ప్రేమలకు అందమైన బందాలు తోడయ్యేవి. ఈనాటి ప్రేమకు ఆకర్షణ, రొమాన్స్ తోడయ్యాయి. స్వచ్చమైన ప్రేమను దక్కించుకునేందుకు ఆనాడు దేవదాస్ అవతారాలు ఎత్తితే.. నేడు కత్తులతో బెదిరించి మరీ ప్రేమను పొందాలనుకుంటున్నారు. ఇప్పుడే కత్తులు చూపించి లొంగదీసుకోవాలని చూసే వాళ్లు నూరేళ్లు ప్రశాంతంగా ఎలా కలిసుండగలరు?. అలాంటి వయలెన్స్‌తో కూడిన ప్రేమ.. సంసార జీవితం వరకు ఎలా రాగలుగుతుంది?. ఇవన్నీ డోంట్‌కేర్.. మేము కోరుకున్న దాని కోసం సొంత అక్క అయినా, అన్న అయినా, ఎవరైనా సరే.. అడ్డొస్తే అడ్డంగా నరికేయడమే ఈ సరికొత్త ప్రేమకు నేటి లవర్స్ చేసిన నిర్వచనం. తన ప్రేమను కాదన్న కోపంతో ఓ ప్రేమోన్మాది అమ్మాయి తమ్ముడిని కత్తితో పొడిచి చంపేసాడు. అడ్డొచ్చిన అమ్మాయికీ కత్తి గాయాలు అయ్యాయి.
Singireddy Niranjan Reddy : ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం 10,000 ఎకరాలు
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
శివకుమార్, పృథ్వీ, సంఘవి ముగ్గురూ షాద్‌నగర్‌లో కలిసి చదువుకున్నారు. చిన్నప్పటి నుండి క్లాస్మేట్స్ కావడంతో ముగ్గురూ చాలా క్లోజ్‌గా ఉండేవారు. ఆ క్లోజ్‌నెస్‌కు లవ్ అని పేరు పెట్టేసిన శివకుమార్.. సంఘవికి తన మనసులోని మాట చెప్పాడు. చిన్ననాటి స్నేహితులం కదా అని చనువిస్తే.. ఇదేం పద్దతి అంటూ పృథ్వి, సంఘవి శివకుమార్‌కు వార్నింగ్ ఇచ్చారు. అయినా ఎలాగైనా సంఘవిని దక్కించుకోవాలనుకున్న నిందితుడు.. తరుచూ ఆమెను వెంబడించే వాడు. ఇతగాడి వేదింపులు తట్టుకోలేక అక్క, తమ్ముడు ఇద్దరూ తామెక్కడ ఉంటున్నామన్నది కూడా శివకుమార్‌కు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అయినా శివకుమార్ వారి అడ్రస్ పట్టేసాడు. కొద్ది రోజులుగా ఫోన్లో తనను ఆవాయిడ్ చేస్తున్న సంఘవి ఉంటున్న రూమ్‌కు తన సోదరితో కలిసి వెళ్లిన శివకుమార్.. పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. ఆమె అంగీకరించక పోగా పృథ్వీ శివకుమార్ సోదరికి నచ్చజెప్పి పంపించేసాడు. తాను ప్రేమంచిన అమ్మాయి ఇక తనకు ఎప్పటికీ దక్కదనుకున్న అతగాడు.. ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ఉన్న సంఘవి రూమ్‌కు మరోసారి వెళ్లాడు. సంఘవిని కత్తితో బెదిరిస్తుండగానే మరో గదిలో ఉన్న పృథ్వీ పరుగున వచ్చి అక్కను కాపాడుకునే ప్రయత్నం చేసాడు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న శివకుమార్.. తన చేతిలోని కత్తితో పృథ్వీ చాతీపై పొడిచాడు. భయంతో బయటకు పరుగులు తీసిన పృథ్వీ తన అక్కను కాపాడాలంటూ అరిచి కుప్పకూలిపోయాడు.
Ustad Bhagat Singh: కత్తులతో ఉస్తాద్ డైరెక్టర్.. మనల్ని ఎవడ్రా ఆపేది?
భయంతో వణికిపోతున్న సంఘవిని ఇంటిపక్కనే ఉన్న ఝాన్సీ అనే మహిళ వచ్చి కాపాడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే వారిద్దరిని హాస్పిటల్‌కు తరలించే లోపే పృథ్వీ ప్రాణాలు కోల్పోయాడు. సంఘవిని ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తన సోదరిపై దాడి చేసి తమ్ముడి ప్రాణాలు తీసిన శివకుమార్‌ను కఠినంగా శిక్షించాలని మరో సోదరుడు డిమాండ్ చేసాడు. మా అన్నను హాస్పిటల్‌కు తరలించకుండా స్థానికులు వీడియోలు తీస్తూ నిల్చున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు. మరోవైపు శివకుమార్ గత నేరచరిత్రపై పోలీసులు ఆరా తీయాలని డిమాండ్ చేసాడు. గతంలో సొంత తండ్రిని సైతం చంపినట్టు అనుమానాలున్నాయన్నారు. నిందితుడు శివకుమార్‌ను ఆదివారం అర్దరాత్రి స్పాట్‌కు తీసుకెళ్లి సీన్రీకన్స్ట్రక్షన్ చేసారు. దాడి జరిగిన ప్లేస్‌లో నిందితుడి నుంచి వివరాలు సేకరించారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని నిజాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!