Site icon NTV Telugu

Pastor Praveen Case: పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసులో కీలక విషయాలు..

Poster

Poster

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బెజవాడలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసు విచారణలో కీలక ఆధారాలను పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను విశ్లేషించిన పోలీసులకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ప్రమాదం జరిగిన రోజున ప్రవీణ్ గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్య బైక్ సహా రోడ్డుపై పడిపోయినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌లో కనిపించింది. అదే సమయంలో అతని బుల్లెట్ బైక్ డూమ్ పగిలినట్టు గుర్తించారు.

READ MORE: Mehendi Artist Suicide Case: అత్తాపూర్ మెహిందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య కేసులో ట్విస్ట్..

ప్రవీణ్ 5:15 గంటలకు బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ మీదుగా నగరంలోకి ప్రవేశించినట్లు సీసీ టీవీ ఆధారంగా నిర్ధారించారు. అనంతరం రామవరప్పాడు వద్ద మరోసారి బైక్‌పై నుంచి కిందపడిన ప్రవీణ్, మూడు గంటల పాటు రోడ్డుపక్కనే ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత రాత్రి 8:15 గంటలకు ప్రవీణ్ తిరిగి రామవరప్పాడు నుంచి బయల్దేరినట్లు గుర్తించారు. పోలీసులు కోదాడ నుంచి బెజవాడలోని గుంటుపల్లి, రామవరప్పాడు ప్రాంతాల్లో ప్రవీణ్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను సేకరించారు. మొత్తం సీసీ టీవీ ఫుటేజ్‌ను తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రవీణ్ ప్రమాదం వెనుక మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

READ MORE: Mehendi Artist Suicide Case: అత్తాపూర్ మెహిందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య కేసులో ట్విస్ట్..

Exit mobile version