NTV Telugu Site icon

AP Cabinet: ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet: ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమైంది. మంత్రిమండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదించింది.నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్‌ పుడ్‌ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్‌ కాలేజ్‌ ఏర్పాటుకు ఆమోదం మంత్రి మండలి తెలిపింది. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీ పరిధిలో హార్టికల్చరల్‌ పాలిటెక్నికల్‌ కళాశాల పని చేయనుంది.

Read Also: AP Assembly: అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

నంద్యాల జిల్లా డోన్‌లో వ్యవసాయ రంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్శిటీ పరిధిలో అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల పని చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రేవేట్‌ యూనివర్శిటీస్‌ (ఎస్టాబ్లిస్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) యాక్ట్‌ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ ఫీల్డ్‌ కేటగిరిలో మూడు ప్రైవేట్‌ యూనివర్శిటీలకు అనుమతి లభించింది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, రాజమండ్రిలో గోదావరి గ్లోబల్‌ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో 05–02–2024 నాడు ఉభయ సభలను ఉద్దేశించి ద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ ప్రసంగానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

Show comments