Site icon NTV Telugu

AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఆ బిల్లుకు ఆమోదం

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ.. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను తప్పిస్తూ బిల్లు పెట్టనుంది. ఎన్నికల్లో ఈ నిబంధనను తప్పిస్తామని కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలోని ఎక్సైజ్ అవతవకలపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. 2014-19, 2019-24 ప్రభుత్వాల్లో ఎక్సైజ్ పాలసీలపై చర్చించారు. గత ప్రభుత్వం దోపిడీకే ఎక్సైజ్ పాలసీ రూపొందించినట్టు కేబినెట్ అభిప్రాయపడింది.

Read Also: AP: కృష్ణానదీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్.. ప్రకాశంబ్యారేజ్ గేట్లు ఎత్తి నీరు విడుదల.. అత్యవసర నంబర్లు ఇవే..

ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని తప్పించి.. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కూడా మార్పులు తేవాలని కేబినెట్ సూచించింది. మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గత ప్రభుత్వం ఇచ్చిన 217 జీవోను మంత్రివర్గం రద్దు చేసింది. మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. నాటి సీఎం జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లపై కేబినెట్లో చర్చించారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రీ-సర్వే ప్రక్రియను అబయెన్సులో పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

 

Exit mobile version