CS Shanti Kumari : సద్దుల బతుకమ్మ వేడుకలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- ఈనెల 10న ట్యాంక్‌బండ్‌పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
- బతుకమ్మ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపిన ప్రభుత్వం
- బతుకమ్మ వేడుకల ఏర్పాట్ల పై నేడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష
- బుద్ధ విగ్రహం.. సంజీవయ్య పార్క్ లనుండి ప్రత్యేకంగా ఫైర్ వర్క్స్.. లేజర్ షో ల ప్రదర్శన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 10న ట్యాంక్‌బండ్‌పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్న సీఎస్ శాంతి కుమారి తెలిపారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై దాదాపు పదివేల మంది మహిళలచే ఈనెల 10 వతేదీన సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియచేశారు. 10వ తేదీన నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్ల పై నేడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగాగల అమరవీరుల స్మారక కేంద్రం నుండి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్ బండ్ పైకి చేరుకుంటారని, వీరితోపాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని వివరించారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసే వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు.
Jaggery Benefits: బెల్లంతో గ్యాస్ ఉబ్బరాన్ని ఇలా పోగొట్టుకోవచ్చు!
Also Read
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఈ సందర్బంగా, బుద్ధ విగ్రహం, సంజీవయ్య పార్క్ లనుండి ప్రత్యేకంగా ఫైర్ వర్క్స్, లేజర్ షో ల ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. ఈ బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని పండగ శోభ వచ్చేలా నగరంలోని 150 ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేయడమే కాకుండా పలు జంక్షన్ల కేంద్రాల వద్ద విధ్యుత్ దీపాలతో అలంకరించినట్టు తెలిపారు. నగరంలోని అన్ని ప్రధాన కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఆడేందుకు సమీపంలోని వాడలు, కాలనీలు, బస్తీల నుండి పెద్ద ఎత్తున మహిళలు వచ్చే అవకాశమున్నందున వారికి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా, ట్యాంక్ బండ్ చిల్డ్రన్స్ పార్క్ లోఉన్న బతుకమ్మ ఘాట్ తోపాటు నెక్లెస్ రోడ్డులో బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ ఎంసీ అధికారులను కోరారు. సాయంత్రం 5 .30 నుండి 7 .30 గంటల మధ్య ట్యాంకు బండ్ పై బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నందున ట్రాఫిక్ డైవర్షన్, బారికేడింగ్, కనీస సౌకర్యాల ఏర్పాట్లను చేపట్టాలని తెలిపారు. అమరవీరుల స్మారక కేంద్రం నుండి ట్యాంక్ బండ్ వరకు ప్రత్యేకంగా బారికేడింగ్, లైటింగ్ సౌకర్యాలను కల్పించాలని కోరారు. ప్రతీ శాఖ ఒక సీనియర్ అధికారిని ప్రత్యేకంగా నియమించి ఏర్పాట్లను పర్యవేక్షించాలని సి.ఎస్ ఆదేశించారు.
Uddhav Thackeray: కాంగ్రెస్-ఎన్‌సీపీ ప్రకటించిన సీఎం అభ్యర్థికి శివసేన మద్దతు ఇస్తుంది..
తాజావార్తలు
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?