NTV Telugu Site icon

Shoaib Malik Big Statement: పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కీలక ప్రకటన..!

Hahid Afridi

Hahid Afridi

షోయబ్ మాలిక్ ప్రస్తుతం పాకిస్థాన్ తరఫున టీ20 ఫార్మాట్‌లో మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాడు. ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ, “నేను ఇప్పటికే రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాను. నేను లీగ్ క్రికెట్ ఆడుతున్నాను. నా మిగిలిన సమయాన్ని ఆస్వాదిస్తున్నాను. ప్రస్తుతం నేను ఎక్కడ ఉన్నా ఆడే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.” అని పేర్కొన్నాడు.

READ MORE: Paris Olympics 2024: నేనెంతగానో మెరుగయ్యా.. నా ఆటను కోర్టులో చూస్తారు: సింధు

మాలిక్‌ను టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి అడిగినప్పుడు.. అతను త్వరలో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్ అవుతానని చెప్పాడు. “ఇకపై నాకు పెద్దగా ఆడేందుకు ఆసక్తి లేదు. ఇంతకుముందు నా ఇంటర్వ్యూలలో చెప్పినట్లు, త్వరలో అన్ని రకాల క్రికెట్‌ల నుంచి శాశ్వతంగా రిటైర్ అవుతాను” అని చెప్పాడు. ఈ ఇంటర్వ్యూలో అతను బాబర్ ఆజం కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని, తన బ్యాటింగ్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలని అతను అభిప్రాయపడ్డాడు. కెప్టెన్సీ భారం తొలగిపోయిన తర్వాత, బాబర్ మెరుగైన ప్రదర్శన చేయగలడని తెలిపాడు.

READ MORE:Operation Sarp Vinash 2.0: జమ్మూకశ్మీర్లో ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0 షూరు..

షోయబ్ మాలిక్ 1999లో పాకిస్థాన్ తరఫున అరంగేట్రం చేశాడని తెలిసిందే. అప్పటి నుంచి గ్రీన్ టీమ్ తరఫున 35 టెస్టులు, 287 వన్డేలు, 124 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మాలిక్ మూడు ఫార్మాట్లలో కలిపి 11000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. బౌలింగ్‌లో మొత్తం 218 వికెట్లు పడగొట్టాడు. లీగ్ క్రికెట్‌లో 13360 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా అతను ప్రపంచంలోనే రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ (14562) పేరు మొదటి స్థానంలో ఉంది.