Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ketan Agarwal Murder Case: పుణె రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మరణం వెనుక ఉన్న అసలు రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ సర్వత్రా కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో పోలీసులు కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిల కుట్రను తెరపైకి తెస్తుండగా.. సియా తల్లిదండ్రుల స్టేట్మెంట్లు మాత్రం సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. “ఒకవేళ నీకు కేతన్ నచ్చకపోతే ఇప్పుడే చెప్పేయ్..” అని సియా గోయల్‌ను ఆమె తల్లి పూజా గోయల్ ఒకటికి పదిసార్లు అడిగారట. కానీ ప్రతిసారీ సియా నవ్వుతూ.. “మమ్మీ, నాకు కేతన్ అంటే చాలా ఇష్టం, నేనతడినే పెళ్లి చేసుకుంటాను. నా జీవితంలో ఇంకెవరూ లేరు” అని సమాధానమిచ్చిందని పూజా గోయల్ చెబుతున్నారు. సియాకు, చేతన్ చౌదరికి ఒక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పరిచయం ఏర్పడిందని, అది కేవలం సాధారణ స్నేహం మాత్రమే అనుకున్నామని, వారిద్దరి మధ్య ప్రేమాయణం ఉందనే విషయం తమకు అస్సలు తెలియదని ఆమె పేర్కొన్నారు. అసలు చేతన్ చౌదరిని తాము ఎప్పుడూ చూడలేదని, ఒకవేళ కూతురి మనసులో వేరే ఆలోచన ఉండి ఒక్క మాట చెప్పినా పెళ్లి కోసం ఒత్తిడి చేసేవాళ్లం కాదని సియా తండ్రి ప్రవీణ్ గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు.
గోవా పెళ్లిలో కుదిరిన సంబంధం
ప్రవీణ్ గోయల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంబంధం ఎలాంటి మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా వచ్చింది కాదు. గోవాలో జరిగిన ఒక కుటుంబ వివాహ వేడుకలో అగర్వాల్ కుటుంబం మొదటిసారి సియాను చూసి సంబంధం మాట్లాడారు. అప్పట్లో సియా వయసు కేవలం 19 ఏళ్లు కావడంతో అంత తొందరలేదని గోయల్ కుటుంబం చెప్పింది. ఆ తర్వాత కర్జత్‌లో జరిగిన మరో ఫంక్షన్లో బంధువులు కూడా నచ్చజెప్పడంతో ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి. ఫిబ్రవరి 11న ఇరు కుటుంబాలు అధికారికంగా కలుసుకోగా, ఫిబ్రవరి 19న నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. నిశ్చితార్థం తర్వాత సియా తరచూ కేతన్ ఇంటికి వెళ్లేదని, పూజలు, కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనేదని, వారి మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నట్లు ఎప్పుడూ అనిపించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Also Read
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
- Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు
కుటుంబ సభ్యుల వాదనలు ఇలా ఉంటే, పోలీసుల దర్యాప్తు మాత్రం మరో కోణాన్ని ఆవిష్కరిస్తోంది. సియా గోయల్, చేతన్ చౌదరి గత ఆరు నెలలుగా నిరంతరం టచ్‌లో ఉన్నట్లు డిజిటల్ ఆధారాలు చెబుతున్నాయి. వీరిద్దరి మధ్య ఏకంగా 2004 సార్లు ఫోన్ కాల్స్ జరిగాయని, దాదాపు 238 గంటల పాటు మాట్లాడుకున్నారని పోలీసులు గుర్తించారు. ఇందులో కొన్ని కాల్స్ రెండు మూడు గంటల పాటు సాగాయి. ఇంత సుదీర్ఘమైన సంభాషణలు కేవలం స్నేహానికి పరిమితం కావని పోలీసులు భావిస్తున్నారు. ఇక, జూన్ 18న జరిగిన ఘోరానికి ఒక రోజు ముందు (జూన్ 17న) సియా, చేతన్ ఇద్దరూ పుణెలోని లుల్లానగర్ పరిధిలో ఉన్న ఒక కేఫేలో కలుసుకున్నారని, అక్కడే హత్యకు పక్కా ప్లాన్ వేశారని దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. లోహాఘడ్ కోటకు సంబంధించిన వివరాలను సియా ఇంటర్నెట్, యూట్యూబ్ ద్వారా చేతన్‌కు పంపిందని, అంతకంటే ముందే మే 31న సియా ఒకసారి అక్కడికి వెళ్లి రేకీ కూడా నిర్వహించిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
సీసీటీవీ కెమెరా.. ఆ 48 నిమిషాల మిస్టరీ
ఈ కేసులో పోలీసులకు అత్యంత కీలకమైన ఆధారం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా లభించింది. ఘటన జరిగిన సమయంలో ఒక యువకుడు హూడీ ధరించి కోట వైపు వెళ్లడం కనిపించింది. టైమ్ కాలిక్యులేషన్ చేయగా, ఆ వ్యక్తి కేవలం 48 నిమిషాల్లోనే కోట పైకి వెళ్లి కిందకు వచ్చేసినట్లు తేలింది. కొండ ఎక్కడానికి, దిగడానికి పట్టే సమయాన్ని మినహాయిస్తే, అతను కోట పైభాగంలో కేవలం 8 నుంచి 10 నిమిషాలు మాత్రమే ఉన్నాడు. ఈ అసాధారణ కదలికే పోలీసులకు గట్టి అనుమానాన్ని తెప్పించింది. మరోవైపు, కేతన్ కింద పడిపోయిన విధానంపై సియా మార్చి మార్చి చెప్పిన సమాధానాలు కూడా ఆమెను బుక్ చేశాయి. మొదట ఫోటోలు దిగుతూ బ్యాలెన్స్ తప్పి పడిపోయాడని చెప్పిన సియా, ఆ తర్వాత తాను అలిసిపోయి నీళ్లు అడగ్గా బాటిల్ ఇచ్చే క్రమంలో కేతన్ కాలు జారిందని వెల్లడించింది. ఈ వైరుధ్యాల వల్లే పోలీసులు కాల్ డేటా, డిజిటల్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి అసలు నిజం బయటపెట్టారు. ప్రస్తుతం ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు వడ్గావ్ కోర్టు సియా గోయల్, చేతన్ చౌదరిలకు జూన్ 29 వరకు పోలీస్ కస్టడీ విధించింది. ఒకవైపు కన్నతల్లి కూతురిని అమాయకురాలిగా నమ్ముతుండగా, మరోవైపు పోలీస్ రికార్డులు మాత్రం ఆమె వేసిన పక్కా స్కెచ్‌ను నిరూపిస్తున్నాయి.
తాజావార్తలు
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
-
Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి భారీ కాంబినేషన్?
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
-
Venky Atluri : OTTలో వెబ్ సిరీస్‌తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!