Site icon NTV Telugu

Nagoba Jatara: గిరిజన ఆరాధ్యదైవం నాగోబాను దర్శించుకోనున్న కేంద్ర మంత్రి.. జాతర విశేషాలివే..

Nagoba Jatara

Nagoba Jatara

Nagoba Jatara: ఆదీవాసీలు అత్యంత వైభవంగా జరుపుకునే నాగోబా జాతరకు వేళయింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. ప్రతీ ఏడాది పుష్యమాస అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహా పూజలతో నాగోబా జాతర మొదలవుతుంది. ఈ వేడుకకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ జాతర ఉత్సవాలు నేటి నుంచి 28వ తేది వరకు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నాగోబా జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వెళ్లనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ నుంచి బయలుదేరనున్నారు. 11 గంటల వరకు కేస్లాపూర్ చేరుకోనున్నారు. గిరిజన ఆరాధ్యదైవమైన నాగోబాను నేతలు దర్శించుకోనున్నారు. అనంతరం గిరిజనులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల రాకతో జిల్లా నేతలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని అర్జున్ ముండా, బండి సంజయ్ ప్రసంగించనున్నారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.

ఇక నాగోబా జాతర ప్రత్యేకత విషయానికి వస్తే గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా జరగనున్న ఈ జాతరలో శనివారం సాయంత్రం ఎడ్ల బండ్లతో గోవాడ్‌కు చేరుకుంటారు. ఆపై నాగోబా ఆలయాన్ని పవిత్ర గంగాజలంతో శుద్ధి చేసి , ఆపై ప్రత్యేక పూజలు చేసి ఏడు రకాల పాము పుట్టలను తయారుచేసి వాటికి ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు. దీంతో నాగోబా అనుగ్రహం కలుగుతుందని మెస్రం వంశీయులతోపాటుగా, ఆదివాసీలు విశ్వసిస్తారు.

KTR: ముగిసిన కేటీఆర్ దావోస్ పర్యటన.. రాష్ట్రానికి రూ.21 వేల కోట్ల పెట్టుబడులు

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తినమడుగు నుంచి సేకరించిన గంగా జలాన్ని మట్టికుండలలో మెస్రం వంశ మహిళలు అందిస్తారు. గిరిజన సాంప్రదాయ డోలు, పెప్రి, కాళికోం వాయిద్యాలతో పూజాసామాగ్రిని గంగాజలంతో పాటు శోభాయాత్ర నిర్వహించి నాగోబా అలయానికి వెళ్లి పూజలు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో ఏడు పుట్టల వద్ద నవ ధాన్యాలు, ఆవు పాలు, నైవేద్యాలు సమర్పిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర నేడు రాత్రి 10 గంటలకు నాగోబాకు మహాపూజతో ప్రారంభంకానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుండే కాకుండా వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు జాతరకు తరలివస్తారు.

ఈ నెల 24న నిర్వహించే దర్బార్ సమావేశానికి రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హారరుకానున్నారు. గిరిజన సంక్షేమ శాఖ, దేవాదాయ శాఖలు రాఘవ జాతరకు కావలసిన రహదారులు, తాగునీరు, మౌలిక వసతులకు సంబంధించి కఅన్ని ఏర్పాట్లు చేసింది. ఆర్టీసి నిర్మల్, ఉట్నూర్, అసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ డిపోల నుంచి నేటి నుంచి 28వరకు ప్రత్యేక బస్సులు నడపనుందని ఆర్టీసీ ఆర్ ఎం జానీరెడ్డి తెలిపారు.

Exit mobile version