Kesineni Swetha: విజయవాడ వ్యాపార రంగానికి వస్త్రలత ఒక ల్యాండ్ మార్క్ వంటిదని కేశినేని శ్వేత అన్నారు. వస్త్రలత కార్మికుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని.. వైఎస్సార్‌సీపీ కార్మికుల, కర్షకుల పక్షపాత పార్టీ అని వ్యాఖ్యానించారు. పేదల, కార్మికుల సంక్షేమ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అమ్మ ఒడి ,చేయూత, వాహన మిత్ర వంటి పథకాలతో పాటుగా ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సహాయాన్ని అందిన చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని పేర్కొన్నారు. నవరత్న పథకాలతో రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరిందన్నారు. ఆ పథకాలను కాపీ కొట్టి టీడీపీ మేనిఫెస్టో తయారు చేసిందని విమర్శించారు. వాలంటరీ వ్యవస్థను మొదటి నుంచి వ్యతిరేకంగా మాట్లాడిన టీడీపీ కూటమి పెద్దలు ఇప్పుడు వాలంటరీలకు 10,000 వేతనం ఇస్తామంటూ చెప్పడం హాస్యాస్పదమన్నారు. వృద్ధాప్య, వికలాంగుల, వితంతు తదితర పింఛనుదారులకు ఇంటింటికి పింఛను వెళ్ళనీయకుండా చేసిన చంద్రబాబుకు పింఛనుదారులంతా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
Read Also: AP Weather: రికార్డు స్థాయిలో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత.. రేపు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
మండుటెండల్లో పింఛన్‌దారులను బ్యాంకుల చుట్టూ టీడీపీ నాయకులు తిప్పుతున్నారని.. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. విజయవాడ నగరాన్ని కేశినేని నాని రెండు దాఫాలు ఎంపీగా చేసి ఎంతో అభివృద్ధి చేశారని చెప్పుకొచ్చారు. రానున్న కాలంలో సైతం అదే అభివృద్ధిని కొనసాగించాలంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. వస్త్రలత కార్మికుల సమస్యలని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేసేందుకు వ్యాపారస్తులకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలబడుతుందన్నారు. అనంతరం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 41 వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేశినేని శ్వేత పాల్గొన్నారు. విజయవాడ ప్రజలు గడప గడపకు వెళ్తుంటే బ్రహ్మరథం పడుతున్నారని.. కేశినేని నానిని, ఆసిఫ్‌ని గెలిపించుకోవడం మా బాధ్యత అంటున్నారన్నారు.
