NTV Telugu Site icon

Kesineni Swetha: గడప గడపకు కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం..

Kesineni Swetha

Kesineni Swetha

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55 డివిజన్లో ఎంపీ కేశినేని నాని కుమార్తె.. కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ.. వైసీపీకే ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల నుంచి పేద ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు, అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నారని.. ఎంతమంది కూటమి పార్టీలన్నీ గుంపుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి విజయం కాయమన్నారు. విజయవాడలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ తలుపు కొట్టేది కేశినేని భవన్దేనని పేర్కొన్నారు. కరోనా సమయం తోమందిని ఆదుకున్న వ్యక్తి కేశినేని నాని అని అన్నారు.

Summer Tips : వేసవిలో పుదీనా నీరు తాగడం వల్ల కలిగే లాభాలేన్నో..

కేశినేని నాని గెలుపు ఆల్రెడీ రాసిపెట్టి ఉంది.. విజయవాడ ప్రజలు కేశినేని నాని వాళ్ళ సొంత మనిషిగా మా వాడు అని భావిస్తారని కేశినేని శ్వేత తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వాలంటరీ వ్యవస్థను తెచ్చి పథకాలన్నీ పేద ప్రజల ఇంటికి వెళ్లే విధంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రతిపక్షాలన్నీ ఇంతకుముందు వాలంటరీ వ్యవస్థ గురించి, వాలంటరీల గురించి చాలా తప్పుగా మాట్లాడేవారు.. అదే ఇప్పుడు కూటమి పార్టీలన్నీ వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారని దుయ్యబట్టారు. ఏ ఇంటికి వెళ్ళినా జగనన్న పథకాలు వస్తున్నాయని చెప్పారు. నాడు నేడు ద్వారా చదువు నవరత్నాల ద్వారా పేద ప్రజల కష్టాలు తీర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.

Krunal Pandya: మరోసారి తండ్రైన టీమిండియా క్రికెటర్.. పోస్ట్ వైరల్..

కేశినేని నాని మార్క్ విజయవాడ ప్రజలందరికీ తెలుసు.. కేశినేని నాని విజయవాడ అభివృద్ధిలో భాగంగా ఫ్లై ఓవర్స్, హాస్పిటల్స్, ఎయిర్ పోర్ట్, ఇలా విజయవాడని గత పది సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా కేశినేని నాని అభివృద్ధి చేశారన్నారు. కూటమి అభ్యర్థులు తప్పుడు వాగ్దానాలు, తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను ఓట్లు అడుగుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ఇక్కడ లోకల్ పర్సన్.. విజయవాడ సమస్యలన్నీ ఆసిఫ్ కు బాగా తెలుసన్నారు. కేశినేని నాని ఎంపీగా, ఎమ్మెల్యేగా షేక్ ఆసిఫ్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నానని కేశినేని శ్వేత తెలిపారు.