Site icon NTV Telugu

Kesineni Nani: నేను విజయవాడ పార్లమెంట్‌కు కాపలా కుక్కను.. కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

Kesineni Nani

Kesineni Nani

Kesineni Nani: నీతి నిజాయితిపరులే రాజకీయాల్లోకి రావాలి అంటూ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. సంపాదన కోసం కొంత మంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్‌గా మారిందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “నేను కానీ, నా కుటుంబ సభ్యులు ఎవరూ బెజవాడ పశ్చిమ నుంచి పోటీ చేయరు. నా కుమార్తె శ్వేత పోటీ చేస్తారు అనేది వాస్తవం కాదు. బెజవాడ పశ్చిమ సీటు బీసీ లేదా మైనార్టీలది. నేను రాజకీయాల్లోకి వచ్చింది కేవలం ప్రజా సేవ కోసం మాత్రమే. నేను ఈస్ట్ లేదా వెస్ట్ ఏలటానికి రాలేదు. కేవలం ప్రజాసేవకు మాత్రమే వచ్చాను. నేను దోచుకోను.. మరి ఎవరిని దోచుకోనివ్వను.. అందుకే నాపై అక్రమార్కులు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. విజయవాడలో అవినీతి, అక్రమార్కులను సహించేది లేదు. నేను ఎంపీగా లేకుంటే, టీడీపీలో లేకుంటే బెజవాడ పార్లమెంట్‌ను జగ్గయ్య పేట నుంచి దోచు కావచ్చని కొందరి ఆలోచన. వారితో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాను. కొన్ని కబంధహస్తాల నుంచి వెస్ట్ నియోజకవర్గాన్ని కాపాడేందుకే బాధ్యత తీసుకున్నా. పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు మంచి వ్యక్తిని ఎన్నుకుంటారు’’ అని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు.

Read Also: YS Sharmila: ఫిబ్రవరి 17న వైఎస్‌ షర్మిల కుమారుడి వివాహం.. ట్వీట్ వైరల్!

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొంటానికి నిజాయితీ పరులు చాలా మంది పార్టీలో ఉన్నారని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. గత 2 ఎన్నికల్లో బెజవాడ పశ్చిమలో తనకు ఎంపీగా మెజార్టీ వచ్చిందన్నారు. 2 సార్లు తనకు 17 వేలకు పైగా మెజార్టీ పశ్చిమలో వచ్చిందన్నారు. పశ్చిమలో మనిషిని చూసి ఓటు వేస్తారు తప్ప పార్టీకి కాదన్నారు. పార్టీ సరైన వ్యక్తికి సీటు ఇస్తే గెలిపిస్తారు, సరైన వ్యక్తికి సీటు ఇవ్వకపోతే ఏడించటం పశ్చిమ నియోజకవర్గంలో తీర్పు అలా ఉంటుందన్నారు. కాల్ మనీ వ్యాపారులు ఏంటి, కేశినేని నాని అంటే ఏంటి అనేది బెజవాడ పశ్చిమ నియోజక వర్గ ప్రజలు గమనిస్తూ ఉన్నారన్నారు. కొందరు తమ స్వార్థం కోసం బెజవాడ కార్పొరేషన్‌ను ఓడించారన్నారు.

Exit mobile version