Site icon NTV Telugu

Kesineni Chinni vs Kesineni Nani: కేశినేని బ్రదర్స్‌.. నాని వ్యాఖ్యలకు చిన్ని కౌంటర్

Kesineni Chinni

Kesineni Chinni

Kesineni Chinni vs Kesineni Nani: విజయవాడ లోక్‌సభ స్థానం.. కేశినేని ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది.. బెజవాడ ఎంపీగా ఉన్న అన్న కేశినేని నానిని పక్కనబెట్టిన టీడీపీ.. ఆ బాధ్యతలు తన సోదరుడు కేశినేని చిన్నికి అప్పగించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. అయితే, నాకుటుంబంలో చిచ్చు పెట్టారు. నన్ను చాలా రకాలుగా అవమానించారు అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన తర్వాత కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఆ కామెంట్లకు అదే స్థాయిలో కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు టీడీపీ సీనియర్‌ నేత కేశినేని చిన్ని.. మా కుటుంబ కలహాలు 1999 ఉంచి ఉన్నాయి.. కొనసాగుతూనే ఉన్నాయి.. వాటితో చంద్రబాబుకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. నాని నన్ను ఎన్ని అన్నా 1999 ఉంచి నేనే సద్దుకుంటూ పోతున్నాను అని వెల్లడించారు.

Read Also: Ram Mandir : అయోధ్యకు ఉచిత రైలు.. బిజెపి ప్రభుత్వం కీలక నిర్ణయం

అసలు నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నానికి లేదన్నారు చిన్ని.. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్ష మరిచి మాట్లాడటం తగదని హితవుపలికారు.. ఎంతో మంది మహామహులు టీడీపీని వీడినా పార్టీకి ఏమీ కాలేదని గుర్తుచేశారు. వచ్చే వాళ్లు వస్తుంటారు, పోయేవాళ్లు పోతుంటారు, ఇప్పటి వరకూ టీడీపీని ఏం చేయలేకపోయారని స్పష్టం చేశారు కేశినేని చిన్ని. ఇక, టీడీపీ నుంచి వెళ్లిపోవాలన్న ఉద్దేశంతోనే గత నాలుగేళ్లుగా వైసీపీ నేతలతో నాని టచ్‌లో ఉన్నారని విమర్శించారు.. ఇక, ఎలాగూ పదవి కాలం అయిపోతుంది.. దాంతోనే ఇప్పుడు రాజీనామా చేసి.. ఆది నుంచి జరుగుతోన్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని మండిపడ్డారు కేశినేని చిన్ని.

Read Also: Shruti Haasan: బ్లాక్ డ్రెస్ లో బ్లాస్టింగ్ అందాలతో అదరకొడుతున్న శృతి హాసన్….

మా కుటుంబానికి రూ. 2 వేల కోట్లా వ్యాపారమా..? రూ. 2 వేల కోట్లంటే.. రూ. 2 అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని ఎద్దేవా చేవారు చిన్ని.. మా మధ్య గొడవలు 1999-2000 నుంచే ఉన్నాయి. అప్పుడే మా మధ్య చంద్రబాబు గొడవలు పెట్టారా..? అని నిలదీశారు. నన్ను కుటుంబ సభ్యుడిగా ఎప్పుడూ చూడలేదని కేశినేని శ్వేత అన్నారు. మా మధ్య గొడవల్లేవనడానికి కేశినేని శ్వేత కామెంట్లే నిదర్శనం అన్నారు. రూరల్ నియోజకవర్గాల్లోనే టాటా ట్రస్ట్ ద్వారా కేశినేని నాని సేవలందించారు. రూరల్ నియోజకవర్గాల్లో కేశినేని నానికి తక్కువ ఓట్లు వచ్చాయి. అర్బన్ సెగ్మెంట్లల్లోనే కేశినేని నానికి ఓట్లు పడ్డాయి. విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్‌తో పాటు పడిన ఓట్లతోనే కేశినేని నాని గెలిచారనితెలిపారు. బెజవాడ పార్లమెంటులో ఏడు సెగ్మెంట్లల్లో టీడీపీ గెలుస్తుంది. బెజవాడ లోక్ సభ స్థానాన్ని లక్షన్నర మెజార్టీతో టీడీపీ గెలవబోతోంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేశినేని చిన్ని.

Read Also: Saachi Movie OTT Release: రియల్ స్టోరీతో తీసిన మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కాగా, బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ కేశినేని నాని.. తాను టీడీపీ కోసం చాలా కష్టపడ్డాను. టీడీపీ కోసం నా సొంత వ్యాపారాలను పక్కనపెట్టాను. వాటికన్నా పార్టీనే ముఖ్యమనుకున్నా.. టీడీపీ కోసం సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని నాకు చాలా మంది చెప్పారు.. కానీ, నేను ఎవరి మాటలు వినకుండా పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేశాను అని గుర్తు చేసుకున్నారు.. ఇక, నాకుటుంబంలో చిచ్చు పెట్టారు. నన్ను చాలా రకాలుగా అవమానించారు. నన్ను గొట్టంగాడు అన్నా.. భరించా. చంద్రబాబు పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలను నా భుజంపై మోశా. నన్ను చెప్పు తీసుకుని కొడతానని ఓ క్యారెక్టర్ లెస్ వ్యక్తి తిట్టినా పార్టీ స్పందించలేదని కేశినేని నాని వ్యాఖ్యానించిన విషయం విదితమే.

Exit mobile version