Kerala Rains: కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం.. పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. రుతుపవనాలకు ముందు కురుస్తున్న వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. ఈ క్రమంలో.. రాష్ట్రంలోని ఎర్నాకులం, త్రిసూర్‌లలో రెడ్ అలర్ట్.. పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్ మరియు వాయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా.. భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. ఆరెంజ్ అలర్ట్ ప్రాంతాల్లో 11 సెం.మీ నుండి 20 సెం.మీ మధ్య భారీ వర్షం కురుస్తుందని సూచించింది.
Trending Video: మృగరాజు మరణాన్ని శాసించిన దున్నపోతు.. వైరల్ వీడియో..
Also Read
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
ఈ నేపథ్యంలో.. భారీ వర్షాల వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రజలను హెచ్చరించారు. “తక్కువ కాలంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవి ఆకస్మిక వరదలకు కారణం కావచ్చు. సాధారణంగా పట్టణ ప్రాంతాలు మరియు లోతట్టు ప్రాంతాలలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. నిరంతర వర్షపాతం కొండచరియలు విరిగిపడవచ్చు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి” అని పినరయి విజయన్ పేర్కొన్నారు. సీల్ లేని ఇళ్లు, పైకప్పు బలహీనంగా ఉన్న ఇళ్లలో నివసించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి విజయన్ కోరారు. ఆపదలో ఉన్నవారు అధికారులను సంప్రదించి భద్రతా పరంగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు.
Palestine protests effect: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి తాళం
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 223 మందిని ఎనిమిది శిబిరాలకు తరలించారు. దీంతోపాటు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటికే కేరళ అంతటా తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిరువనంతపురం, కొచ్చి, త్రిస్సూర్ వంటి ప్రధాన నగరాలు వరద నీటిలో కూరుకుపోయాయి. కొచ్చిలో కెఎస్ఆర్టిసి బస్టాండ్, ఎంజి రోడ్‌తో సహా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. బాధిత నివాసితులకు సహాయం చేయడానికి తిరువనంతపురం, కొట్టాయం జిల్లాల్లో రెండు సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. కోజికోడ్‌లోని మావూరు ప్రాంతంలో వర్షాలు భారీగా పడటంతో వ్యవసాయ రంగం అపారంగా నష్టపోయింది. ఇటు.. మలప్పురం, కాసర్గోడ్ జిల్లాల్లో చిన్నపాటి కొండచరియలు విరిగిపడడంతోపాటు అలప్పుజాలోని జాతీయ రహదారిపై తురవూర్ ప్రాంతంలో మూడు గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రతికూల వాతావరణం కారణంగా కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..