Kerala High Court: ‘దత్తత’ అనే పదం తొలగించండి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారిక పత్రాల్లో దత్తత తీసుకున్న పిల్లలను ‘దత్తపుత్రుడు’ లేదా ‘దత్తపుత్రిక’ అని పేర్కొనే పద్ధతిని తక్షణమే తొలగించాలని కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దత్తత తీసుకున్న పిల్లలను కేవలం తల్లిదండ్రుల ‘కుమారుడు’ లేదా ‘కుమార్తె’ గానే గుర్తించాలని జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ స్పష్టం చేశారు. తన తండ్రి మరణానంతరం జారీ చేసిన వారసత్వ ధృవీకరణ పత్రంలో తనను ‘దత్తపుత్రిక’ అని పేర్కొనడాన్ని సవాలు చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ కీలక తీర్పు వెలువరించింది.
హిందూ దత్తత, మనోవర్తి చట్టం-1956లోని సెక్షన్ 12 ప్రకారం, దత్తత తీసుకున్న తేదీ నుంచి ఆ చిన్నారి అన్ని విధాలా ఆ తల్లిదండ్రుల సొంత బిడ్డగానే పరిగణించబడతారని కోర్టు పేర్కొంది. సమాజం కూడా వారిని సొంత పిల్లలుగానే చూస్తున్నప్పుడు, ప్రభుత్వ రికార్డుల్లో ప్రత్యేకంగా ‘దత్తత’ అనే పదాన్ని చేర్చాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఆ పదం వాడటం అవమానకరం కాకపోయినా, అధికారిక పత్రాల్లో మాత్రం దానిని పూర్తిగా నివారించాలని స్పష్టం చేశారు.
Also Read
- Astrology Predictions : డిసెంబర్ 2026 గ్రహ సంచారాలు.. ఈ ఐదు రాశులకు పట్టిందల్లా బంగారమే
- Nifty 50: పరుగులు పెడుతున్న నిఫ్టీ 50.. 52 వారాల గరిష్టానికి చేరుతుందా..?
- Hindu Population: హిందూ జనాభాలో అగ్రస్థానం.. ముస్లిం జనాభాలో రెండో స్థానం.. 2070 నాటి ప్రపంచంలో భారత్‌లో పరిస్థితి!
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. వాయిదాల రూపంలో డబ్బుల విత్ డ్రాకు అవకాశం..
పిటిషనర్‌ను 1990లో ఆమె నెల రోజుల వయసులో ఉన్నప్పుడు ఒక దంపతులు కోర్టు ద్వారా దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి పాస్‌పోర్ట్, రేషన్ కార్డు, పాన్ కార్డు, పదో తరగతి సర్టిఫికేట్ సహా అన్ని పత్రాల్లో ఆమె వారి కుమార్తెగానే నమోదయ్యారు. 2023లో ఆమె తల్లి మరణించినప్పుడు ఇచ్చిన వారసత్వ పత్రంలో కూడా ‘కుమార్తె’ అనే రాశారు. కానీ 2024లో తండ్రి మరణించిన తర్వాత తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికేట్లో ‘దత్తపుత్రిక’ అని పేర్కొనడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.
ఈ-డిస్ట్రిక్ట్ పోర్టల్ నిబంధనల ప్రకారమే అలా రాశామన్న ప్రభుత్వ వాదనను కోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్‌కు రెండు వారాల్లోగా కేవలం ‘కుమార్తె’ అని పేర్కొంటూ కొత్త వారసత్వ పత్రం ఇవ్వాలని త్రిసూర్ తహసీల్దార్‌ను ఆదేశించింది. అలాగే నెల రోజుల్లోగా ఇ-డిస్ట్రిక్ట్ పోర్టల్ నుంచి ‘దత్తపుత్రుడు/దత్తపుత్రిక’ అనే ఆప్షన్‌ను తొలగించి నిబంధనలు సవరించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Kerala High Court: ‘దత్తత’ అనే పదం తొలగించండి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు..
-
Astrology Predictions : డిసెంబర్ 2026 గ్రహ సంచారాలు.. ఈ ఐదు రాశులకు పట్టిందల్లా బంగారమే
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
Jailer 2 : బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ ఊచకోత.. కానీ ఆ రెండు రికార్డులు మిస్
-
Nifty 50: పరుగులు పెడుతున్న నిఫ్టీ 50.. 52 వారాల గరిష్టానికి చేరుతుందా..?
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!