Site icon NTV Telugu

Kerala: ఒంటెపై పెళ్లి ఊరేగింపు.. వరుడిపై కేసు నమోదు

Kamel

Kamel

కేరళలోని కన్నూర్‌లో ఒంటెపై పెళ్లి ఊరేగింపుగా వెళ్లినందుకు వరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతనితో పాటు 25 మంది సహచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు అభియోగాలు మోపారు. గుంపులుగా గుమికూడడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం వంటి అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also: PM Modi: అభివృద్ధిలో ట్రాక్ రికార్డ్ కలిగిన ఏకైక పార్టీ బీజేపీనే..

వరుడు రిజ్వాన్ కన్నూర్‌లోని వలపట్టణానికి చెందినవాడు. జనవరి 14న తన వివాహం సందర్భంగా ఒంటెపై వధువు ఇంటికి పెళ్లి ఊరేగింపుగా వెళ్తుండగా కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి ఊరేగింపు కారణంగా అంబులెన్స్‌లతో సహా అనేక వాహనాలు జామ్‌లో చిక్కుకోవడంతో ట్రాఫిక్ స్తంభించిందని తెలిపారు.

Read Also: Harish Rao : కేసీఆర్‌ వల్లే రాష్ట్రంలో పేదరికం తగ్గింది

అంతేకాకుండా.. ఊరేగింపులో స్మోక్ గన్‌లను ఉపయోగించారని, ఇది తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై స్థానికులు సమాచారం ఇచ్చారని.. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పెళ్లికొడుకును ఒంటెపై నుంచి దింపామన్నారు. కాగా.. వరుడితో వచ్చిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వార్నింగ్ ఇచ్చి విడుదల చేశారు.

Exit mobile version