Site icon NTV Telugu

Kerala: డీకే శివకుమార్కు కేరళ సర్కార్ కౌంటర్.. జంతుబలి జరగలేదని వెల్లడి..!

Kerala

Kerala

Kerala govt: కేరళ ప్రభుత్వం ఇవాళ (శనివారం) కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఉత్తర కేరళలోని ఓ దేవాలయం దగ్గర జంతుబలి ఇచ్చారన్న వాదనను తోసిపుచ్చింది. తనను లక్ష్యంగా చేసుకుని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ ఆరోపణల్లో నిజం లేదని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె. రాధాకృష్ణన్ అన్నారు.

Read Also: Heatwaves: వడగాల్పులతో 56 మంది మృతి.. ఒక్క మే నెలలోనే ఎంత మందో తెలుసా..?

ఇక, జంతుబలిపై 1968 నుంచి చట్టపరంగా నిషేధం ఉంది.. అందుకే కేరళలో అలా జరగడం సాధ్యం కాదని మంత్రి కె. రాధాకృష్ణన్ తెలిపారు. సంబంధిత ఆలయ నిర్వహణ కమిటీ శుక్రవారం శివకుమార్ ఆరోపణలను సైతం ఖండించింది. కర్ణాటక డిప్యూటీ సీఎం వాదనలు 100 శాతం అబద్ధం.. కేరళలోని ఏ దేవాలయం దగ్గరా ఏ జంతువును బలి ఇచ్చినట్లు ఆధారాలు లేవని పేర్కొంటూ స్పెషల్ బ్రాంచ్ రాష్ట్ర పోలీసు చీఫ్‌కు నివేదిక కూడా సమర్పించిందని మంత్రి పేర్కొన్నారు. తమ విచారణలో భాగంగా మలబార్ దేవస్వామ్ బోర్డును కూడా సంప్రదించాం.. అక్కడ కూడా ఎలాంటి జంతుబలి జరగలేదని ధృవీకరించిందని చెప్పారు.. కర్ణాటక ఉపముఖ్యమంత్రి చేసిన ఆరోపణల తరహాలో కేరళలో ఎక్కడైనా జరిగిందా అనే కోణంలో ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరి శివకుమార్ ఎందుకు ఇలాంటి ఆరోపణ చేశాడనే దానిపై కూడా విచారణ జరగాలని కె. రాధాకృష్ణన్ అన్నారు.

Exit mobile version