ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టును అభ్యర్థించారు. అలాగే వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలంటూ మరో పిటిషన్ వేశారు. దీంతో గురువారం ఇరు వర్గాల వాదనలు జరిగాయి. అయితే ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్నికల ప్రచార వేళ ఆరోగ్యమేమీ అడ్డంకిగా మారలేదని గుర్తుచేసింది. బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని ఈడీ కోరింది.
ఇది కూడా చదవండి: Haircut: హెయిర్ కటింగ్ చేయడానికి ఆలస్యంగా వచ్చాడని.. బార్బర్‌ని లాకప్‌లో పెట్టిన పోలీస్..
మార్చి 21న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం అరెస్ట్, కస్టడీపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ రిలీఫ్ దొరకలేదు. అనంతరం సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయం దగ్గర పడుతుండడంతో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి:Ts Weather: రాష్ట్రంలో భానుడి భగభగ.. ఆదిలాబాద్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ ఇటీవల సుప్రీంను ఆశ్రయించారు. జూన్ 9న జైలుకు వెళ్లి లొంగిపోతానని పేర్కొన్నారు. అయితే ఆ పిటిషన్ నమోదుకు బుధవారం సుప్రీం రిజిస్ట్రీ నిరాకరించింది. కానీ రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు ఆయనకు స్వేచ్ఛ ఉందని, అందుకే ఈ పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని వెల్లడించింది. దీంతో ఆయన గురువారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. రెగ్యులర్ బెయిల్‌తో పాటు మధ్యంతర బెయిల్ పొడిగించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. బెయిల్ విషయంలో ఈ శనివారంకల్లా స్పందన తెలియజేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Tenth Pass: పట్టువదలని విక్రమార్కుడు.. 10వ ప్రయత్నంలో టెన్త్ పాస్.. బ్యాండ్ మేళంతో ఊరేగింపు..
