Site icon NTV Telugu

Delhi: ఢిల్లీ తదుపరి సీఎస్‌ పీకే గుప్తా!.. కేంద్ర అనుమతిని కోరిన ఆప్ సర్కారు

Delhi

Delhi

Delhi: ఢిల్లీ కొత్త ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పీకే గుప్తాను నియమించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కేంద్రం ఆమోదం కోరినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఈ ప్రతిపాదనను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్-గవర్నర్ వీకే సక్సేనాకు పంపారు. ఆయన నియామకానికి అనుమతిని అభ్యర్థించారు. ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్ ఈ ఏడాది చివరి నాటికి పదవీ విరమణ చేయనున్నారు.

Read Also: RBI: రూ.535 కోట్ల నగదుతో రోడ్డుపై నిలిచిపోయిన కంటైనర్.. ఆ తర్వాత ఏమైందంటే?

పీకే గుప్తా ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ)లో అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. మే 16న సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ముఖ్యమైన తీర్పులో అధికారుల బదిలీ, పోస్టింగ్‌తో సహా సేవల వ్యవహారాల్లో ఢిల్లీ ప్రభుత్వానికి కార్యనిర్వాహక అధికారం ఇవ్వబడింది. ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వం ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ అధికార పరిధిలోకి వచ్చే భూమి, పోలీసు, పబ్లిక్ ఆర్డర్‌లకు సంబంధించిన సేవల శాఖ వ్యవహారాలపై శాసన, కార్యనిర్వాహక అధికారాలను కలిగి ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

Exit mobile version