Revolver Rita : స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ స్వింగులో ఉన్నారు. ఓ వైపు హీరోయిన్ గా గ్లామర్ పాత్రలను చేస్తూనే మరో వైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనలోని ప్రతిభను చాటుకుంటున్నారు. ఇప్పటికే గుడ్ లక్ సఖి.. మిస్ ఇండియా వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించి మంచి మార్కులు వేయించుకున్నారు. రీసెంట్ గా రఘు తాత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో రివాల్వర్ రీటా సినిమా కూడా ఉంది. కన్నడ దర్శకుడు చంద్రు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను.. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
చాలా నెలల క్రితమే కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 90స్ లుక్ లో రెండు చేతిలో రివాల్వర్స్ పట్టుకుని కీర్తి సురేష్ కనిపించింది. కౌ బాయ్ తరహాలో డిజైన్ చేసిన పోస్టర్.. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. అయితే కీర్తి బర్త్ డే సందర్భంగా.. రివాల్వర్ రీటా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది. ప్రస్తుతం ఆ టీజర్ జనాలను ఆకట్టుకుంటుంది. రివాల్వర్ తో ఆమె ఆటాడుకుంటూ.. గూండాలకు వణుకు పుట్టిస్తూ కీర్తి సురేష్ కనిపించడంతో రివాల్వర్ రీటా సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. రివాల్వర్ రీటా మూవీతో మంచి హిట్ అందుకునేలా కనిపిస్తుందని అంటున్నారు.
Read Also:Sadhguru Jaggi Vasudev: సద్గురుకు ఉపశమనం.. అక్రమ నిర్బంధం కేసులో విచారణను నిలిపివేసిన సుప్రీంకోర్టు