మహానటి కీర్తి సురేష్ తన చిరకాల ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌ను పెళ్లి చేసుకుని ఒక ఇంటిదైన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ జంట తమ ‘హౌస్ ఆఫ్ ఫన్’ అని పిలుచుకునే ఇంటిని వీడియో ద్వారా అభిమానులకు చూపిస్తూ, కొన్ని పర్సనల్ విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా 15 ఏళ్ల ప్రేమ ప్రయాణం తర్వాత జరిగిన ఆ పెళ్లి వేడుకలో తలెత్తిన భావోద్వేగాల గురించి కీర్తి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read :Pawan kalyan : టాప్ బ్యానర్‌లో పవన్ కళ్యాణ్ సినిమా?
నిజానికి వీరు సినిమాల్లో చూపించినట్లుగా లేచిపోయి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశారట, కానీ చివరికి పెద్దల సమక్షంలో గోవాలో అట్టహాసంగా వీరి వివాహం జరిగిందట. పెళ్లి ముహూర్త సమయం గురించి కీర్తి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యింది. అంతే రాదు ‘తాళి కట్టే ఆ 30 సెకన్ల సమయంలో నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియలేదు. నా మెదడు మొద్దుబారిపోయింది, కేవలం ఆ తాళి మాత్రమే నా కళ్ల ముందు కనిపించింది’ అని చెప్పుకొచ్చింది. అయితే అన్నిటికంటే తనను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, తన భర్త ఆంటోనీ కళ్లలో నీళ్లు తిరగడం.. ‘మేము గత 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం, కానీ అతడు ఏడవడం నేను ఆ తాళి కట్టే సమయంలోనే మొదటిసారి చూశాను. ఆ క్షణం మా ఇద్దరికీ చాలా ప్రత్యేకమైనది’ అని కీర్తి వివరించింది. సినిమాల్లోకి రాకముందే మొదలైన వీరి బంధం, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌ను తట్టుకుని నిలబడి, ఇలా ఒక్కటవ్వడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ప్రస్తుతం కీర్తి ‘తోట్టమ్’ అనే సినిమాతో బిజీగా ఉంది.
