NTV Telugu Site icon

Keerthy Suresh Married Antony Thattil: క్రిస్టియన్ పద్ధతిలో మళ్లీ పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్-ఆంటోని..

Keerthy Suresh Married Antony Thattil

Keerthy Suresh Married Antony Thattil

Keerthy Suresh Married Antony Thattil: స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవల తన చిరకాల స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ను వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 12న గోవాలో జరిగిన ఈ వివాహ వేడుక హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుక గోప్యంగా నిర్వహించబడింది. అయితే, ఆ తరువాత కీర్తి సురేశ్ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దాంతో దంపతులకి పలు సినీ ప్రముఖులు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కీర్తి సురేశ్, ఆంటోని తట్టిల్ క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో కూడా పెళ్లి జరుపుకున్నట్లు ఫొటోలు, వీడియోలు బయటికి వచ్చాయి. వీటిలో ఇద్దరూ రింగ్స్ మార్చుకుంటూ, డ్యాన్స్ చేస్తూ ఉన్న దృశ్యాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు, అభిమానులు మరోసారి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వేడుకల్లోని సన్నివేశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

కీర్తి సురేశ్, ఆంథోనీల స్నేహం దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఈ విషయాన్ని కీర్తి స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీపావళి వేడుకల్లో భాగంగా తన భర్త ఆంథోనితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ, “15 ఏళ్ల స్నేహబంధం ఇక జీవితాంతం కొనసాగుతుంది” అని క్యాప్షన్ ఇస్తూ అసలు విషయాన్నీ తెలిపింది. వీరిద్దరి పరిచయం స్కూల్ రోజుల్లోనే మొదలైందని, కాలేజీ రోజుల్లో ఆ స్నేహం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. ఆంథోనీ వ్యాపార కుటుంబానికి చెందినవాడు. అతనికి కొచ్చి, చెన్నై ప్రాంతాల్లో వ్యాపారాలు ఉన్నాయి. సినిమాల విషయానికి వస్తే, కీర్తి సురేశ్ త్వరలో బాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఇందులో కీర్తి హీరోయిన్ గా “బేబీ జాన్” అనే చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రం ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Show comments