Kedarnath Temple: నేటి నుంచి కేదార్‌నాథ్‌ దర్శనం.. తొలి పూజలో పాల్గొన్న ‘పుష్కర్ సింగ్ ధామీ’..

Chardham Yatra

Chardham Yatra

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయ తలుపులు ఈరోజు తెరుచుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అధికారులు ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన ద్వారాలను తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కుటుంబ సమేతంగా తొలి పూజకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేదారేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Also Read: Post Office Super Plan : పోస్టాఫీస్ సూపర్ ప్లాన్.. రూ. 333 డిపాజిట్ చేస్తే రూ.17 లక్షలు మీ సొంతం..

×
×
Ad

కేదార్‌నాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి కాగా.. కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించడం చార్ధామ్ యాత్రలో భాగం. ప్రతి సంవత్సరం, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వందలాది మంది భక్తులు కేదార్‌నాథ్ స్వామిని దర్శించుకోవడానికి, ప్రత్యేక పూజలు చేయడానికి వస్తారు. అయితే, ఈ ఆలయం శీతాకాలంలో మూసివేయబడుతుంది. దాదాపు ఆరు నెలల పాటు మూసి ఉన్న ఈ ఆలయ తలుపులు భక్తుల దర్శనం కోసం ఈరోజు తెరిచారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. దాదాపు 40 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. కేదారేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయాన్నే ఆలయం వెలుపల బారులు తీరారు.

Also Read: US: న్యూయార్క్‌లో దారుణం.. మహిళపై దుండగుడి అఘాయిత్యం

మరోవైపు యమునోత్రి ఆలయాన్ని ఉదయం 7 గంటలకు తెరిచారు. గంగోత్రి ఆలయం మధ్యాహ్నం 12:20 గంటలకు తెరవబడుతుంది. చార్ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 12న ప్రారంభించనున్నట్లు బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు.