Bus Accident: కేదార్నాథ్ యాత్రికుల బస్సును ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరు మృతి, 15 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Accident: పంజాబ్‌లోని లూథియానా సమీపంలోని సమ్రాలా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడి చహేలా గ్రామంలో ఉదయం భక్తులతో నిండిన టూరిస్ట్ బస్సు హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఢీకొనడంతో బస్సులో ఉన్న ఇద్దరు మహిళా భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, 15 మందికి పైగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మీనాక్షి (51), సరోజబాల (54)గా గుర్తించారు.
చదవండి:Medaram Priests: మేడారం పూజార్ల హెచ్చరిక.. ధర్నా చేస్తామని ప్రకటన
Also Read
- Petrol-Diesel: పెట్రోల్‌లో ఇథనాలు, డీజిల్‌లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
- Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- Tejashwi Yadav: బ్యాలెట్‌తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
ఇండోర్‌లో నివసించే రిషబ్ మాట్లాడుతూ.. మేము ఇండోర్ స్థానికులమని, బస్సులో కేదార్‌నాథ్‌కు వెళ్తున్న వారంతా రైతు కుటుంబానికి చెందినవారని చెప్పారు. ప్రజలందరూ చార్‌ధామ్‌లో ఉన్న కేదార్‌నాథ్‌ను సందర్శించడానికి వెళ్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు మేము హరిద్వార్ నుండి అమృత్‌సర్‌కు బయలుదేరాము. ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా కలకలం రేగింది.
చదవండి:Kishan Reddy: బోనస్ ఇచ్చి కొనడానికి మీకు బాధ ఏంటి.. కిషన్ రెడ్డి ఫైర్
10రోజుల్లో ఏడు లక్షల మంది భక్తులు
దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం చార్ధామ్ యాత్రకు వెళతారు. ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రకు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. గత 10 రోజుల్లో ఏడు లక్షల మందికి పైగా భక్తులు నాలుగు క్షేత్రాలను దర్శించుకున్నారు. అయితే ఈసారి ప్రభుత్వం, అధికార యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తీర్థయాత్రకు వచ్చిన పలువురు భక్తులు దేవుడిని దర్శించుకోకుండానే తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. ఛార్‌ధామ్ తీర్థయాత్ర కోసం పరిపాలన తాత్కాలిక నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించింది. అయితే ఇప్పటివరకు దాదాపు నాలుగు వేల మంది భక్తులు రిషికేశ్ నుండి ఇంటికి తిరిగి వచ్చారు. ఉత్తరాఖండ్‌కు చేరుకున్నా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోలేకపోవడం దురదృష్టకరమని తిరిగి వచ్చిన యాత్రికులు తెలిపారు.
తాజావార్తలు
-
Petrol-Diesel: పెట్రోల్‌లో ఇథనాలు, డీజిల్‌లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
-
Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
-
Tejashwi Yadav: బ్యాలెట్‌తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!